నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది: అక్కినేని నాగార్జున
ఓ అన్నయ్యగా, అభిమానిగా అఖిల్‌ను చూస్తే ఎంతో గర్వంగా ఉంది - బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌లో నాగ చైతన్య అక్కినేని మూడు రోజుల్లోనే ‘లెనిన్’ బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది - బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌లో అఖిల్ అక్కినేని అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం 'లెనిన్'. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదలై సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో అక్కినేని అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లందరితో కలిసి సోమవారం నాడు బ్లాక్ బస్టర్…
