Skip to content

‘రుద్రవీణ’ స్ఫూర్తితో ‘బాలు’ పాత్రను అర్థం చేసుకున్నా : అక్షయ్ లగుసాని

‘డెడ్ పిక్సెల్స్’, ‘కుమారి శ్రీమతి’, ‘హాస్టల్ డేస్’ వంటి వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులకు దగ్గరైన నటుడు అక్షయ్ లగుసాని. కామెడీ, డ్రామా, యూత్‌ఫుల్ కథల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న అక్షయ్, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో రానున్న ‘జగమే సంగీతం’ సిరీస్‌లో బాలు అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. సంగీత నేపథ్యంతో తెరకెక్కిన ఈ సిరీస్‌లో బాలు తన కుటుంబం నుంచి వచ్చిన సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తూనే, తనకంటూ ఒక ప్రత్యేకమైన సంగీత ప్రయాణాన్ని ఏర్పరుచుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ పాత్ర కోసం తాను తీసుకున్న జాగ్రత్తల గురించి అక్షయ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బాలు పాత్ర గురించి అక్షయ్ మాట్లాడుతూ, “నాకు ఈ పాత్ర కోసం కాల్ వచ్చిన వెంటనే ‘రుద్రవీణ’ సినిమా…

Read more

‘ప్రేమనే ఊరిలో’ చిత్రం నుంచి ‘ఏరై పారే హృదయం’ పాట విడుదల

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్‌గా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయగా అందరిలోనూ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏరై పారే హృదయం’ అంటూ సాగే అందమైన పాటను మల్లారెడ్డివిశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్ డా. సీహెచ్. ప్రీతిరెడ్డి రిలీజ్ చేశారు. ఈ పాటను సమీరా భరద్వాజ్ ఆలపించారు. రాంబాబు గోసాల సాహిత్యం, సునాద్ గౌతమ్ బాణీ ఈ…

Read more

కూకట్‌పల్లిలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు హాజరైన సాయి దుర్గా తేజ్

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా కూకట్‌పల్లిలోని గోపాల్ నగర్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ప్రముఖ హీరో సాయి దుర్గా తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వేడుకల్లో పాల్గొని, అక్కడికి వచ్చిన చిన్నారులతో ముచ్చటించారు. చిన్నారులతో కలిసి సాయి దుర్గా తేజ్ కేక్ కట్ చేసి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన…

Read more

ఘనంగా ప్రారంభమైన “ఇ.ఎం.ఐ” మూవీ

నూతన నటీనటులు, టెక్నీషియన్స్ ను పరిచయం చేస్తూ ఎమోషన్ తో కూడిన ఎంటర్ టైనర్ గా రాబోతున్న మూవీ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చిన హీరో ఆది సాయికుమార్, కెమెరా స్విచ్ఛాన్ చేసిన డైరెక్టర్ సాయి మార్తాండ్, స్క్రిప్ట్ అందజేసిన డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ కాంబోలో మరో భారీ చిత్రాన్ని నిర్మించబోతున్న 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ ఇకపై వరుస చిత్రాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్న 7 పి.ఎం. ప్రొడక్షన్స్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఇ.ఎం.ఐ టైటిల్…

Read more

‘ఇరుముడి’ జెనరేషనల్ బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్‌లో మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్

మాస్ మహారాజా రవితేజ జెనరేషనల్ బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న విడుదలై ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ఘన విజయాన్ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ జెనరేషనల్ బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు చిత్ర బృందం సమాధానాలు ఇచ్చారు. శివ నిర్వాణ గారు.. ఇరుముడి సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రేక్షకుల్ని ఇంతలా కనెక్ట్ చేసిన అంశం ఏమిటని దర్శకుడుగా మీరు భావిస్తున్నారు? -ఎమోషన్, అలాగే రియలిస్టిక్ వరల్డ్. నేను తీసుకున్న మూడు లేయర్స్.. వాటి బ్లెండింగ్ సూపర్‌గా వర్కౌట్…

Read more

‘దేవరాయ’- శ్రీకృష్ణదేవరాయగా మజెస్టిక్ అవతార్‌లో అదరగొట్టిన కిచ్చా సుదీప

అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియడ్‌ స్పెక్టాకిల్ ‘దేవరాయ’ టైటిల్ అనౌన్స్‌మెంట్ చేశారు మేకర్స్. విజయనగర సామ్రాజ్యంలోని దిగ్గజ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయగా కిచ్చా సుదీప్‌ను మేకర్స్ మజెస్టిక్ అవతార్‌లో పరిచయం చేశారు. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుప్రియన్వి పిక్చర్ స్టూడియోపై ప్రియ సుదీప్ సమర్పిస్తున్నారు. 'దేవరాయ’ టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో సినిమా ప్రపంచాన్ని అద్భుతంగా పరిచయం చేస్తోంది. భారీ స్థాయిలో, చారిత్రక వైభవంతో తెరకెక్కుతున్న సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. విజువల్స్‌తో పాటు గౌర హరి అందించిన పవర్‌ఫుల్, మజెస్టిక్ స్కోర్ అనుభూతిని మరింత ఎలివేట్ చేసింది. రాజసంతో కూడిన అవతార్‌లో సుదీప్ అద్భుతమైన…

Read more

‘రంభ ఊర్వశి మేనక’ ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే మూవీ: అల్లరి నరేష్

అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. టీజర్‌, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘రంభ ఊర్వశి మేనక’ కథ ఎలా ఉండబోతుంది? -సాధారణంగా ఇలాంటి సోషియో ఫాంటసీ కథల్లో మానవులు ఇంద్రలోకం, యముడి వద్దకు వెళ్తుంటారు. కానీ ఇందులో ‘రంభ ఊర్వశి మేనక’ స్వర్గం నుంచి కిందకు వస్తారు. ఇందులో కథానాయకుడికి చిన్నప్పటి నుంచి…

Read more

“రోమాంచకం” ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ, సినిమా చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేస్తారు – సుమంత్ ప్రభాస్

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా "రోమాంచకం". సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు ఈ సినిమా ఈ నెల 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విశేషాలను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు హీరో సుమంత్ ప్రభాస్. - మా మూవీ కోసం ప్రభాస్ గారిని కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. నా…

Read more

‘స్ట్రీట్ ఫైటర్’ ట్రైలర్ విడుదల

అక్టోబర్ 16న విడుదల ప్రముఖ నిర్మాణ సంస్థలు పారామౌంట్ పిక్చర్స్, లెజెండరీ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘స్ట్రీట్ ఫైటర్’ ట్రైలర్ విడుదలైంది. టోక్యోలోని షింజుకు యునికా విజన్ స్క్రీన్స్‌పై గ్రాండ్‌గా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. దర్శకుడు కిటావో సకురాయ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జేసన్ మోమోవా, డేవిడ్ డాస్ట్‌మల్చియన్, విద్యుత్ జమ్వాల్, 50 సెంట్, కోడి రోడ్స్, రోమన్ రీన్స్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నోహ్ సెంటినియో కెన్ మాస్టర్స్‌గా, ఆండ్రూ కోజి ర్యూగా, కాలినా లియాంగ్ చున్-లిగా నటిస్తున్నారు. 1993 నేపథ్యంలో సాగే ఈ కథలో ర్యూ, కెన్ మరోసారి పోరాటంలోకి దిగుతారు. వరల్డ్ వారియర్ టోర్నమెంట్ చుట్టూ సాగే కథలో ఓ ప్రమాదకరమైన కుట్ర వారిని…

Read more

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా: సుమన్

‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది : చిత్ర దర్శకుడు యుద్ధనపూడి మైకిల్ ‘మా రాముడు అందరివాడు ’ చిత్ర విజయంపై నమ్మకంగా ఉన్నాం : నిర్మాత, విలన్ లక్ష్మణరావు అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’. యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటించారు. సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్ కీలక పాత్రల్లో నటించారు. ఆనంద భారతి, గడ్డం నవీన్, చిట్టిబాబు, గోల్డ్ రెడ్డి ఇతర పాత్రలు…

Read more