‘ది రైజ్ ఆఫ్ అశోక్’ ట్రైలర్ విడుదల
సతీష్ నీనసాం కథానాయకుడిగా 'కాంతార' ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'ది రైజ్ ఆఫ్ అశోక'. కన్నడ, తెలుగు,తమిళ భాషలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి వినోద్.వి.దుండలే దర్శకుడు. వృద్ది క్రియేషన్స్ అండ్ సతీష్ పిక్చర్ హౌస్ పతాకంపై వర్ధన్ హరి, జైష్ణవి, సతీష్ నీనసాం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో కళాసృష్టి ఇంటర్నేషనల్ పతాకంపై రవిశంకర్ తెలుగులో ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పంపిణి చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 27న ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదల కాబోతుంది. కాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్ విడుదల కార్యక్రమం శుక్రవారం చిత్ర టీమ్ సమక్షంలో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కథానాయకుడు…
