త్వరలోనే నితిన్ 36వ సినిమా షూటింగ్ ప్రారంభం
* నితిన్ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై రూపొందనున్న యూనిక్ సైఫై ఎంటర్‌టైనర్.. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నితిన్ తన 36 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెర్సటైల్ డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. పవన్ కుమార్ సమర్పణలో సక్సెస్‌ఫుల్ బ్యానర్ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రథ సప్తమి సందర్భంగా సైఫై ఎంటర్‌టైనర్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు . విభిన్నమైన కథలు, కథనాలతో సినిమాలను రూపొందించే దర్శకుడు వి.ఐ.ఆనంద్ మరోసారి ఈ భారీ ప్రాజెక్ట్‌తో క్రియేటివ్ బౌండరీస్ రేంజ్‌ను మరింత పెంచటానికి సిద్ధమయ్యారు. సినీ ప్రేక్షకులకు ఇప్పటి వరకు చూడని సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను…
