ఇద్దరమ్మాయిలతో లవ్‌లో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? గమ్మత్తుగా ‘లవ్ ఓటిపి’ ట్రైలర్
సూపర్ ఇంట్రెస్టింగ్ పేస్‌తో 2 నిమిషాల 27 సెకన్ల ట్రైలర్‌ను విడుదల చేసిన లవ్ ఓటిపి టీమ్. ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా ఇద్దరమ్మాయిలను ఒకేసారి ప్రేమించి ఇబ్బందిపడే అబ్బాయిల కథలా ఉంది ‘లవ్ ఓటిపి’ ట్రైలర్. ప్రేమంటే అస్సలు పడని నాన్న పాత్రలో బెంగుళూరులో ఉండే పోలీసాఫీసర్‌గా రాజీవ్ కనకాల నటించారు. భవప్రీతా ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ యం రెడ్డి నిర్మాతగా అనీష్, జాన్విక, స్వరూపిణిలు హీరో హీరోయిన్లుగా నటించిన ‘లవ్ ఓటిపి’ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ట్రైలర్‌ను శనివారం విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా నిర్మాత విజయ్ యం రెడ్డి మాట్లాడుతూ–‘‘ ఫ్రెష్ కంటెంట్‌తో వచ్చిన ఏ సినిమాకైనా ఫుల్ డిమాండ్…
