భారతదేశంలో సరికొత్తగా Zee 5 స్పెషల్ ఫీచర్స్ !
ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న వినోద సాధనాలు మునుపెన్నడూ లేనంతగా పెరుగుతున్న ఈ తరుణంలో, ప్రముఖ ఓటీటీ దిగ్గజం జీ5 (Zee 5) సరికొత్తగా అడుగులేస్తోంది. తన కంటెంట్ పరిధిని మరింతగా విస్తరిస్తూ, ప్లాట్ఫారమ్లో అత్యంత కీలకమైన, విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తోంది. మొబైల్, కనెక్టెడ్ టీవీ (Connected TV) వినియోగదారుల కోసం అత్యాధునిక ఏఐ (AI) ఆధారిత పర్సనలైజేషన్, ఆకర్షణీయమైన విజువల్ నావిగేషన్, స్లాట్-రహిత క్రాస్-స్క్రీన్ అనుభవాలతో ప్లాట్ఫారమ్ను అప్గ్రేడ్ చేసింది. భారతీయ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ కొత్త జీ5.. ఐదు విభిన్న విభాగాలతో (ప్రీమియం ఎంటర్టైన్మెంట్, ఫ్రీ 5, కిడ్జ్, టీవీ, స్పోర్ట్స్) వినోదాన్ని వెతకడాన్ని మరింత సులభంగా, లీనమయ్యేలా మార్చింది. న్యూ జీ 5 ప్రత్యేకతలు చూస్తే.. ఏఐ…
