Skip to content

కొత్త పోస్టర్‌తో అంచనాలు పెంచిన రాకింగ్ స్టార్ యశ్

  • MOVIES
  • Vishwanath
కొత్త పోస్టర్‌తో అంచనాలు పెంచిన రాకింగ్ స్టార్ యశ్ Telugu News

రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్ : ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ నుంచి మేకర్స్ న్యూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 20న ఉదయం 9:35 గంటలకు విడుదల చేస్తామని టీం ప్రకటించింది. ఈ మేరకు రిలీజ్ చేసిన న్యూ పోస్టర్ అందరిలోనూ అంచనాల్ని పెంచేసింది. ఇందులో రాయ పాత్రలో యశ్ రక్తాన్ని ఏరులై పారించినట్టుగా కనిపిస్తోంది. మంచు ప్రాంతమైనా కూడా ఎర్రని రక్తంతో నిండిపోయింది. ఇక అలా రక్తపాతాన్ని సృష్టించిన అనంతరం యశ్ మత్తులో మునిగేందుకు మందు తాగుతున్న‌ట్లు కనిపిస్తోంది.

ఈ ఏడాది జాతీయ, అంతర్జాతీయంగా సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న‌ చిత్రాల్లో ‘టాక్సిక్’ ఒకటిగా నిలిచింది. ఒక్కో కారెక్టర్, పాత్రకు సంబంధించిన సంబంధించిన లుక్‌ను రివీల్ చేస్తూ వదిలిన పోస్టర్లు ఎంతటి సంచలనాన్ని క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ‘టాక్సిక్’ వరల్డ్‌ని పరిచయం చేసేలా యశ్ బర్త్ డే సందర్భంగా వదిలిన గ్లింప్స్ ఒక్కసారిగా అంచనాల్ని రెట్టింపు చేసింది. ఇక ఈ మూవీ నుంచి మరి కొంత కథను రివీల్ చేసేలా టీజర్‌ను కట్ చేశారు. ఈ టీజర్‌ను ఫిబ్రవరి 20న రిలీజ్ చేయబోతోన్నారు. కథ, కథనం ప్రభావం అన్ని భాషల్లో ఒకేలా ఉండేందుకు టీజర్‌ను ఒకే భాషలో విడుదల చేస్తారట. ఇది సినిమాలో స్పష్టమైన చిత్రాలను, వాతావరణాన్ని, ఆ ప్రపంచాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తుంది.

‘టాక్సిక్’ సినిమాలో కియారా అద్వానీ నదియాగా, హుమా ఖురేషి ఎలిజబెత్‌గా, నయనతార గంగగా, తారా సుతారియా రెబెక్కాగా, రుక్మిణి వసంత్ మెల్లిసాగా అద్భుతమైన పాత్రల్లో కనిపించనున్నారు. చివరగా రాయ పాత్రలో యశ్‌ను చూపించిన తీరు, వదిలిన పోస్టర్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చింది.

యశ్, గీతు మోహన్‌దాస్ సంయుక్తంగా రాసిన ఈ కథని గీతు మోహన్‌దాస్ తెరపైకి తీసుకు వచ్చారు. ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ కన్నడ, ఇంగ్లీష్ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించారు. ఇక ఈ మూవీని హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, అనేక ఇతర భాషలలో డబ్ చేయనున్నారు.

జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి కెమెరామెన్‌గా, రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్‌గా, టిపి అబిద్ ప్రొడక్షన్ డిజైనర్‌గా అద్భుతమైన సాంకేతిక బృందం ఈ మూవీకి పని చేసింది. జాతీయ అవార్డు గ్రహీత యాక్షన్ డైరెక్టర్లు అన్బరివ్, కేచా ఖంఫక్దీలతో కలిసి హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జెజె పెర్రీ ఈ చిత్రంలో యాక్షన్ సీన్లకు కొరియోగ్రఫీ చేశారు.

కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మించిన ‘టాక్సిక్’ ఈద్, ఉగాది, గుడి పద్వా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 19 మార్చి 2026న థియేటర్లలో విడుదల కానుంది.

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.