యంగ్ హీరో హవిష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాధ రావు నక్కినతో కలసి చేస్తున్న కంప్లీట్…
ఇంటెన్సిటీతో అంచనాలను పెంచేస్తోన్న ‘టాక్సిక్’ టీజర్

2026లో సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సినిమాల్లో ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ ఒకటి. పోస్టర్స్, గ్లింప్స్ అంటూ కొన్ని నెలలుగా సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో మనం చూస్తూనే ఉన్నాం. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాకింగ్ స్టార్ యశ్ బర్త్ డే సందర్భంగా ‘ఇంట్రడ్యూసింగ్ రాయ’ అంటూ తన పాత్రను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఎంత సంచలనమయ్యిందో అందరికీ తెలిసిందే. కియారా అద్వానీ నాడియాగా, హుమా ఖురేషి ఎలిజబెత్‌గా, నయనతార గంగగా, తారా సుతారియా రెబెక్కాగా, రుక్మిణి వసంత్ మెల్లిసాగా అద్భుతమైన పాత్రల్లో కనిపించనున్నారు. వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్స్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శుక్రవారం రోజున టాక్సిక్ మూవీ టీజర్ విడుదలై అభిమానులను అలరిస్తోంది. టాక్సిక్ టీజర్‌ను కన్నడ, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు.
టాక్సిక్ టీజర్‌ను గమనిస్తే.. ఒక విస్తృతమైన, గొప్పదైన సినిమాటిక్ ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. ఇది ఒక వైపు చూడటానికి రంగుల ప్రపంచంలా కనిపిస్తూనే, హింసాత్మకమైన స్వరూపాన్ని కూడా ప్రదర్శిస్తుంది. సర్కస్ వాతావరణం, తూర్పు ఆసియా శైలిని గుర్తు చేసే నేపథ్యాల వరకు వివిధ కాలాల్లో కథ ప్రయాణిస్తున్నట్లు టీజర్‌ను రూపొందించారు. మొత్తం మీద ఒక డార్క్, కాస్త రఫ్ టోన్‌తో టీజర్ కనిపిస్తుంది. టీజర్‌లో చూపించిన బలమైన విజువల్స్, యాక్షన్ సన్నివేశాల వెనుక ఒక లోతైన భావం దాగి ఉన్నట్లు తెలుస్తోంది. కథ చెప్పే విధానంపై ప్రత్యేక శ్రద్ధ, నటీనటుల శక్తివంతమైన ప్రదర్శన..ఇవన్నీ ఈ ప్రపంచానికి ఎంతో కీలకమని టీజర్ సూచిస్తోంది.
ఈ టీజర్లో సినిమాటిక్ తుపాన్ కలకలానికి కేంద్రబిందువుగా రాకింగ్ స్టార్ యశ్ కనిపిస్తున్నారు. ఆయనలో కనిపిస్తున్న మార్పు కేవలం లుక్ మార్చడం మాత్రమే కాదు..పూర్తిగా కొత్త అవతారంలోకి మారినట్టుగా తెలుస్తోంది. సన్నగా, వేగంగా కదిలే శరీరాకృతినుంచి యుద్ధాలకు సిద్ధమైన బలమైన, దృఢమైన ఆకారానికి మారడం వరకు ఆయన చూపించిన శరీరాకృతిలోని మార్పు ఈ సినిమాకి పెద్ద హైలైట్‌గా నిలుస్తోంది. ఈ మార్పు ఆయనెంతోపట్టుదలతో నిరంతర కృషితో కఠిన సాధన చేసిన ఫలితంగా తెలుస్తోంది.
అయితే యశ్ పాత్రలో కనిపిస్తోన్న మార్పు కేవలం బయట కనిపించే లుక్ వరకే పరిమితం కాలేదు. ఇది మరింత లోతైన మార్పును సూచిస్తుంది. ప్రతి లుక్‌కు యశ్ ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, కచ్చితమైన హావభావాలు జోడిస్తూ పాత్రలో పూర్తిగా లీనలమైనట్లు కనిపిస్తున్నారు. అలాగే ఆయన నటనలో కనిపిస్తున్న తీవ్రత, భావోద్వేగాలను గమనిస్తే..ఇవి ఆయన గత పాత్రలతో పోలిస్తే పూర్తిగా కొత్తగా, భిన్నంగా అనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆయన సినీ ప్రయాణంలో చూడని ఈ మార్పులు, సూపర్‌స్టార్‌గా ఆయన కెరీర్‌లో ఒక సాహసోపేతమైన కొత్త దశ ప్రారంభమైందని సూచిస్తోంది.
చిత్రబృందం టీజర్ విడుదల సందర్భంగా “ఇట్స్ గాన్ గెట్ క్రేజీ” అంటూ ఒక ఉత్కంఠభరిత హెచ్చరికను ఇచ్చింది. టీజర్లో కనిపించిన భారీ దృశ్యాలు, భయనకమైన, ఉత్కంఠభరితమైన సీన్స్ చూస్తుంటే 2026 మార్చి 19న రాబోతున్న టాక్సిక్ మూవీపై ఉన్న అంచనాలను మించేలా ఉందనేది తెలుస్తోంది.
యశ్, గీతు మోహన్‌దాస్ సంయుక్తంగా రాసిన ఈ కథని గీతు మోహన్‌దాస్ తెరపైకి తీసుకు వచ్చారు. ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ కన్నడ, ఇంగ్లీష్ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించారు. ఇక ఈ మూవీని హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, అనేక ఇతర భాషలలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మించిన ‘టాక్సిక్’ ఈద్, ఉగాది, గుడి పద్వా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 19 మార్చి 2026న థియేటర్లలో విడుదల కానుంది.
