హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘బ్యాడ్…
జన నాయగన్ సినిమా లీక్ ఆగ్రహం తెప్పిస్తోంది – హీరో విజయ్ దేవరకొండ

జన నాయగన్ సినిమా లీక్ ఘటనపై స్పందించారు హీరో విజయ్ దేవరకొండ. ఈ ఘటన తనకు ఆగ్రహం తెప్పిస్తోందని సోషల్ మీడియా పోస్ట్ చేశారు. తన కెరీర్ లోనూ ఇలాంటి బాధను అనుభవించానని విజయ్ తెలిపారు. కెరీర్ ప్రారంభంలోనే తన సినిమా లీక్ అయ్యిందని, ఆ టైమ్ లో ఎవరో తనను టార్గెట్ చేస్తున్నట్లు, ఆశను కోల్పోయినట్లు అనిపించిందని విజయ్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
విజయ్ దేవరకొండ స్పందిస్తూ – జననాయగన్ సినిమాను రిలీజ్ కు ముందు లీక్ చేయడం ఆగ్రహం తెప్పిస్తోంది. నా కెరీర్ ప్రారంభంలో ఇలాంటి బాధాకర ఘటన ఎదుర్కొన్నా. ఆ టైమ్ లో ఎవరో కావాలని చేశారని అనిపించింది. ఆశలన్నీ కోల్పోయాను. సినిమా అనేది హీరోగా నా ఒక్కరికే కాదు దర్శకులు, నిర్మాతలు, నటీనటులు..ఇలా అందరి కల. జననాయగన్ సినిమా లీక్ వెనక ఎవరున్నారు అనేది వీలైనంత త్వరగా గుర్తించాలి. ఇతరుల గురించి ఒక్క క్షణం ఆలోచించకుండా తప్పులు చేసేవారు ఎలా ఉంటారో ఈ ఘటనతో మరోసారి అర్థమవుతోంది. జననాయగన్ సినిమా టీమ్ అందరికీ నా మద్ధతు తెలియజేస్తున్నా. అన్నారు.
https://x.com/thedeverakonda/status/2042816511027613914?s=48
