Skip to content

జి సినిమా ప్రొడక్షన్ హర్రర్ కామెడీ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం !!!

విజయదశమి పండుగ రోజు
జి సినిమా ప్రొడక్షన్ నెంబర్ 1, శ్రీమతి నేలబల్లి కుమారి సమర్పించు నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది, నిరంజన్, జయంత్, విఖ్యాత్ , సింహ, చరిష్మా , ప్రియ జాస్వర్, గ్రీష్మ నేత్రిక హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాకు రచన, దర్శకత్వం సింహ చలం గుడుపూరు.

నేలబల్లి సుబ్రమణ్యం క్లాప్ కొట్టగా కట్టా గంగాధర రావు ఫస్ట్ షాట్ కు డైరెక్షన్ చేశారు, నేలబల్లి కుమారి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా కు మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్, సినిమాటోగ్రాఫర్ తరుణ్ రావుల, ఎడిటర్ శ్రీ కృష్ణ అట్టలూరి , ఆర్ట్ డైరెక్టర్ వి. నాని పండు.

అక్టోబర్ 8నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది, హార్రర్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

G cinemas banner new film launched in style