Skip to content

పత్రికా ప్రకటన

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు అభివృద్ధి సాధికారిక సంస్థ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రూపేష్ బాబు తాడేపల్లి అమరావతి లోని క్యాంప్ కార్యాలయం నందు జే టి ఓపెన్ యూనివర్సిటీ రిజిస్టర్ గా బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మనబడి – మన భవిష్యత్తు” ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రోగ్రాం డైరెక్టర్ మువ్వ రామలింగం మాట్లాడుతూ డాక్టర్ రూపేష్ బాబు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు అభివృద్ధి సాధికారిక సంస్థ వైస్ ప్రెసిడెంట్ గా వృత్తి నైపుణ్య శిక్షణతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం జరిగిందన్నారు అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ బడులలో చదువుతున్న విద్యార్థినులకు ఆత్మరక్షణ సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారని అన్నారు తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో గల జెటి ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూడా యువతకు విద్యాభ్యాసంతో పాటు వృత్తి నైపుణ్య కోర్సులను ప్రవేశపెట్టి తద్వారా యువత ఉపాధి అవకాశాలు కనిపించాలని ఆకాంక్షించారు

ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ గత 25 సంవత్సరములుగా ప్రభుత్వ సహకారంతో వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను నిరుద్యోగ యువతకు శిక్షణ మరియు ఉపాధి కల్పించడం జరిగిందని తెలిపారు అలాగే ప్రభుత్వ శాఖలలో వేలాదిమందికి ఔట్సోర్సింగ్ విధానం పై ఉద్యోగాలు కల్పించడం జరిగిందని దీంతోపాటు రాష్ట్రంలోనే ప్రభుత్వ స్కూల్స్ లలో చదువుతున్న విద్యార్థినిలకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణా తరగతులను విజయవంతంగా నిర్వహించడం జరిగినది అని అన్నారు నాపై నమ్మకంతో న ఎడ్యుకేషన్ సర్వీసును గుర్తించి నాకు రిజిస్టర్ గా అవకాశం కల్పించిన బోర్డు మెంబర్లకు అధ్యాపకులకు జె టి ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఝాన్సీ రాణి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.