విష్ణు మంచు ‘కన్నప్ప’ చిత్రానికి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక…
* “పవర్” మూవీ ప్రారంభం*

టాలీవుడ్ స్క్రీన్ పైకి యంగ్ అండ్ డైనమిక్ హీరో రాబోతున్నాడు. సాయికృష్ణ హీరోగా, దర్శకుడు వెంకటరమణ పసుపులేటి రూపొందిస్తున్న మూవీ “పవర్”. ఈ మూవీ తాజాగా ఘనంగా ప్రారంభమైంది. “నాది పొగరు కాదురా… నా జాతికి ఈ దేవుడు ఇచ్చిన పవర్…” అనే పవర్ఫుల్ డైలాగ్‌తో సాయికృష్ణ సినీ ఎంట్రీ ఇచ్చారు. మంగళగిరి పరిధిలోని ఆత్మకూరులో వంగవీటి రంగా విగ్రహం వద్ద ముహూర్తం షాట్‌తో చిత్రీకరణ ప్రారంభమైంది.
ప్రారంభోత్సవంలో సాయికృష్ణ పర్సనాలిటీ, అభినయం అతిథులను ఆకట్టుకుని ప్రశంసలు అందుకున్నాయి. ఈ చిత్రంలో అరుణ్ విజయ్, సుజన, భాగ్యశ్రీ, ప్రజ్ఞ, ప్రియతో పాటు సీనియర్ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రం యువతను ఆకట్టుకునే శక్తివంతమైన కథాంశంతో, అద్భుతమైన సాంకేతిక విలువలతో రూపొందుతోంది. సాయికృష్ణ హీరోగా ఈ చిత్రం టాలీవుడ్లో కొత్త ఒరవడిని సృష్టిస్తుందని చిత్ర యూనిట్ భరోసా వ్యక్తం చేసింది.
సాంకేతిక బృందం వివరాలు:
సంగీతం: శంకర్ మహదేవన్
సినిమాటోగ్రఫీ: బి. ఎస్. కుమార్
మేకప్: కుమార్
ఎడిటింగ్: నందమూరి హరి.
పీ.ఆర్.ఓ: కడలి రాంబాబు, దయ్యాల అశోక్
సమర్పణ: ఎస్.ఐ.ఎఫ్.ఏ.ఏ
కథ, స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం: వెంకటరమణ పసుపులేటి