Skip to content

‘బ్యూటీ’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న అంకిత్ కొయ్యకి మెగా బ్లెస్సింగ్స్

మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ కూడా యంగ్ జనరేషన్‌తో ముచ్చట్లు పెట్టేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. యంగ్ హీరోలు, మేకర్లతో చిరంజీవి ఎక్కువగా సంభాషిస్తుంటారు. యంగ్ టాలెంట్ రావాలని, కొత్త రక్తం, కొత్త నీరు ఇండస్ట్రీలో ప్రవహించాలని చిరంజీవి ప్రతీ చోటా చెబుతుంటారు. అలాంటి చిరంజీవి తాజాగా యంగ్ సెన్సేషన్ అంకిత్ కొయ్యను మనస్పూర్తిగా ఆశీర్వదించారు. ‘బ్యూటీ’ అంటూ సెప్టెంబర్ 19న అంకిత్ కొయ్య ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు.

అంకిత్ కొయ్య ‘ఆయ్’, ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ అంటూ అందరినీ నవ్వించి మంచి విజయాల్ని సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఓ అందమైన ప్రేమ కథతో, కుటుంబ సమేతంగా చూడదగ్గ ఓ ‘బ్యూటీ’ ఫుల్ చిత్రంతో అందరి ముందుకు రాబోతోన్నారు. సెప్టెంబర్ 19న అంకిత్ కొయ్య నటించిన ‘బ్యూటీ’ చిత్రం విడుదల కాబబోతోంది. ఈ క్రమంలో అంకిత్ ప్రమోషన్స్ అంటూ ఫుల్ బిజీగా ఉంటున్నారు.

‘బ్యూటీ’ ప్రమోషన్స్‌‌లో ఎంత బిజీగా ఉన్నా కూడా తనకు ఇష్టమైన హీరో, ఆరాధ్య దైవం అయిన మెగాస్టార్ చిరంజీవిని కలిసి అంకిత్ కొయ్య ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక మెగాస్టార్‌ పాదాలకు నమస్కరించి అంకిత్ కొయ్య ఆశీర్వాదాన్ని తీసుకున్న తరువాత సోషల్ మీడియాలో పోస్ట్ వేశారు. ‘ఈ అనుభూతిని, అనుభవాన్ని మాటల్లో చెప్పలేను.. పదాల్లో కూర్చలేను.. ఆయన్ను కలవడం, ఇలా ఆశీర్వాదం తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.. ఆయన ఆశీర్వాదం నేను తిరుగులేని విజయాలు సాధిస్తాననే నమ్మకం ఉంది.. మీరే నాకు కొండంత ధైర్యం.. జై చిరంజీవ’ అంటూ పోస్ట్ వేశారు. ప్రస్తుతం చిరంజీవితో ఇలా అంకిత్ కొయ్య దిగిన ఫోటోలు, వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.