త్వరలో విడుదల కు సిద్ధమవుతున్న "" పోలీస్ వారి హెచ్చరిక "" సినిమా లోని సామాజిక…
‘లోపలికి రా చెప్తా’ సినిమా ట్రైలర్ రిలీజ్


రోజురోజుకు ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకుంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా “లోపలికి రా చెప్తా”
మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న హర్రర్ బేస్డ్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం ‘లోపలికి రా చెప్తా’. కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటించడమే కాకుండా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పాటలు, పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘లోపలికి రా చెప్తా’ చిత్రం జూలై 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది. శనివారం హైదరాబాద్ లో ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా ట్రైలర్ లాంఛ్ జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కొండా విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా
రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ – ‘లోపలికి రా చెప్తా’ సినిమా ట్రైలర్ లాంఛ్ కు అతిథిగా రావడం సంతోషంగా ఉంది. ట్రైలర్ చూశాక మీలో భయం కలిగే ఉంటుంది. అయితే మనల్ని భయపెట్టే విషయాలు ఈ సినిమాలోలాగే బయట కూడా చాలా జరుగుతున్నాయి. ‘లోపలికి రా చెప్తా’ సినిమా ప్రేక్షకుల్ని భయపెట్టడమే కాదు, వారి దగ్గర నుంచి మంచి కలెక్షన్స్ కూడా రాబట్టాలని నా బెస్ట్ విశెస్ ఈ సినిమా టీమ్ కు అందిస్తున్నా. అన్నారు.
నటుడు రమేష్ మాట్లాడుతూ – నేను నాటకరంగం నుంచి వచ్చాను. ఈ చిత్రంతో మళ్లీ తెరపై కనిపించడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మా రాజేంద్ర గారికి థ్యాంక్స్. క్యాచీ టైటిల్ తో మా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మిమ్మల్ని భయపెడుతూనే ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.
లిరిసిస్ట్ అలరాజు మాట్లాడుతూ- దేశం గర్వించదగిన రచయిత విజయేంద్రప్రసాద్ గారు ఈ రోజు మా ‘లోపలికి రా చెప్తా’ సినిమా ట్రైలర్ లాంఛ్ చేయడం సంతోషంగా ఉంది. లోపలికి రా చెప్తా అనే టైటిల్ లోనే ఒక బెదిరింపు లాంటిది ఉంది. ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులు కూడా టైటిల్ మూవీకి కరెక్ట్ గా జస్టిఫై అయ్యిందని భావిస్తారు. హారర్ ఎలిమెంట్స్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ ఆకట్టుకుంటుంది. అన్నారు.
నటుడు ప్రవీణ్ కటారి మాట్లాడుతూ – ప్రేక్షకుల్ని లోపలికి రా చెప్తా అని పిలిచే ఫీల్ తో మా డైరెక్టర్ మంచి టైటిల్ సినిమాకు పెట్టారు. ఈ చిత్రంలో ఓ మంచి రోల్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. స్క్రిప్ట్ గురించి తెసినప్పుడే ఇది మంచి మూవీ అవుతుంది అనే నమ్మకం కలిగింది. అన్నారు.
దర్శకుడు కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ – కొండా వెంకట రాజేంద్ర నా మిత్రుడు. ఆయన కోసమే ఈ కార్యక్రమానికి వచ్చాను. మంచి మంచి ఐడియాస్ తో ఆయన సినిమాలు చేస్తుంటారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించి ఆయనకు పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
నటుడు శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ – రాజేంద్ర నాకు బాగా పరిచయం. కొత్త ఆలోచనలతో సినిమాలు రూపొందిస్తాడు. ఆయన చేసిన ఓ చిత్రంలో గతంలో నటించాను. లోపలికి వస్తే రా అనే టైటిల్ తో లోపలికి వస్తే ఏం చేస్తారో అనే క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు రాజేంద్ర. ఈ సినిమా అందరికీ నచ్చేలా రూపొందించాడు. ఈ మూవీ మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.
హీరో, డైరెక్టర్ కొండా వెంకట రాజేంద్ర మాట్లాడుతూ – ఈ రోజు మా ‘లోపలికి రా చెప్తా’ సినిమా ట్రైలర్ లాంఛ్ కు గెస్ట్ గా వచ్చిన విజయేంద్రప్రసాద్ గారికి, కొండా విజయ్ కుమార్ గారికి థ్యాంక్స్. విజయేంద్రప్రసాద్ గారి శిష్యుడు అనే గుర్తింపు వల్లే నేను ఇండస్ట్రీలో పెద్ద స్టార్స్ సినిమాలకు పనిచేయగలిగాను. స్క్రీన్ ప్లేలో నాకు ఉన్న పదేళ్ల అనుభవంతో ‘లోపలికి రా చెప్తా’ చిత్రాన్ని రూపొందించాను. నాలుగైదు జానర్స్ కలిపి ఈ మూవీకి స్క్రిప్ట్ చేశాను. ఈ సినిమా వెనక రెండేళ్ల హార్డ్ వర్క్ ఉంది. మా ప్రొడ్యూసర్ గణేష్ లేకుంటే ఈ మూవీ లేదు. హారర్, కామెడీతో పాటు యూత్ కు కావాల్సిన రొమాంటిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రేక్షకులకు వారి లైఫ్ లో ఎన్నో ఒత్తిడులు ఉంటాయి. మా సినిమాకు వస్తే ఆ టెన్షన్స్ అన్నింటి నుంచీ రిలీఫ్ అవుతారని గ్యారెంటీగా చెప్పగలను. దేవ్ జాండ్ మా సినిమాకు ఇచ్చిన సాంగ్స్ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. జూలై 5న రిలీజ్ అవుతున్న ‘లోపలికి రా చెప్తా’సినిమాను మీరంతా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
నటీనటులు – కొండా వెంకట రాజేంద్ర, మనీషా జష్ణాని, సుస్మిత ఆనాల, సాంచిరాయ్, అజయ్ కార్తీక్, ప్రవీణ్ కటారి, రమేష్ కైగూరి, వాణి ఐడా, తదితరులు
టెక్నికల్ టీమ్
————–
మ్యూజిక్: దేవ్ జాండ్
డిఓపి: రేవంత్ లేవాక, అరవింద్ గణేష్,
ఎడిటర్: వంశీ,
పి ఆర్ ఓ: బి. వీరబాబు
ప్రొడ్యూసర్స్: లక్ష్మీ గణేష్ చేదెళ్ళ, కొండ వెంకట రాజేంద్ర
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొండా వెంకట రాజేంద్ర