Skip to content

‘సుందరకాండ’ నుంచి ప్లే ఫుల్ మెలోడీ ప్లీజ్ మేమ్ సాంగ్ రిలీజ్

హీరో నారా రోహిత్ తన మైల్ స్టోన్ 20వ మూవీ ‘సుందరకాండ’తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ మేకర్స్ ప్లీజ్ మేమ్ సాంగ్ ని రిలీజ్ చేశారు.

ప్లీజ్ మేమ్ సాంగ్ మోడ్రన్ బీట్‌లతో పాటు తెలుగుదనం కూడా మిక్స్ అయి క్యాచీ, క్రేజీగా వుంది. శ్రీహర్ష ఇమాని రాసిన లిరిక్స్ ఫన్ ఫుల్ గా పాటకి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. వీడియోలో హీరో తన ఫ్రెండ్స్‌తో కలిసి శ్రీదేవిని ఇంప్రెస్ చేయడానికి చేసే ప్రయత్నాలు సరదాగా వున్నాయి.

అర్జున్ చాందీ, దీపక్ బ్లూ, అరవింద్ శ్రీనివాస్, సాయిశరణ్, రేష్మా శ్యామ్, హరిప్రియా, లవితా లోబో కలిసి పాడిన ఈ పాటఅదిరిపోయింది. అందరి వాయిస్‌ మిక్స్‌తో పాటకి ఎనర్జీ రెట్టింపు అయ్యింది. విశ్వరఘు చేసిన కొరియోగ్రఫీ స్టైలిష్‌గా వుంది.

నారా రోహిత్ – శ్రీదేవి విజయ్ కుమార్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది. “ప్లీజ్ మేమ్” పాట సినిమా ఆల్బమ్‌కి ఫ్రెష్ అండ్ ఫన్ టచ్ ఇచ్చి బ్యూటిఫుల్ ట్రాక్ గా నిలిచింది.

ఈ చిత్రంలో వృతి వాఘాని కథానాయికగా నటించారు. గణేష్ చతుర్థి సందర్భంగా ఆగస్టు 27న సినిమా విడుదల కానుంది.

ఈ చిత్రానికి ప్రదీప్ ఎం. వర్మ సినిమాటోగ్రఫీ అందించగా, రాజేష్ పెంటకోట ఆర్ట్ డైరెక్టర్‌గా, సందీప్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత.,

తారాగణం: నారా రోహిత్, వృతి వాఘాని, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, సత్య, అజయ్, వీటీవీ గణేష్, అభినవ్ గోమటం, విశ్వంత్, రూప లక్ష్మి, సునైనా, రఘు బాబు.

సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: వెంకటేష్ నిమ్మలపూడి
నిర్మాతలు: సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి
బ్యానర్: సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP)
DOP: ప్రదీష్ ఎం వర్మ
సంగీతం: లియోన్ జేమ్స్
ఎడిటర్: రోహన్ చిల్లాలే
ఆర్ట్ డైరెక్టర్: రాజేష్ పెంటకోట
సాహిత్యం: శ్రీ హర్ష ఈమని
కాస్ట్యూమ్ డిజైనర్లు: హర్ష & పూజిత తాడికొండ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్
యాక్షన్ కొరియోగ్రఫీ: పృథ్వీ మాస్టర్
డాన్స్ కొరియోగ్రఫీ: విశ్వ రఘు
VFX సూపర్‌వైజర్: నాగు తలారి
PRO: వంశీ-శేఖర్
డిజిటల్ – ప్రవీణ్ & హౌస్‌ఫుల్ డిజిటల్