‘హ్యాపీ జర్నీ’ నుంచి బ్యూటీఫుల్ ఫస్ట్ సింగిల్ ‘ఆనందమే’ రిలీజ్
రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, మహిళల భావోద్వేగాలను ప్రధానంగా తీసుకుని రూపొందుతున్న చిత్రం 'హ్యాపీ జర్నీ'. ఏడు మంది మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల కీలక సహాయ పాత్రలను పోషించారు. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ల పై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్న 'హ్యాపీ జర్నీ' చిత్రంతో అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతుండగా, తరుణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్‌తో భారీ అంచనాలను రేకెత్తించిన చిత్ర బృందం, ఇప్పుడు 'ఆనందమే'…
