Y N R Sports Academy,church GaGiLLAPUR. Dr. Laaksha Naidu has received "AN…
ఘనంగా క్రీడా దినోత్సవం

మెహిదీపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో వారం రోజులుగా క్రీడా దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు క్రీడా పోటీలు నిర్వహించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్ని ప్రదర్శించారు. క్రీడా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శనివారం నిర్వహించిన ముగింపు వేడుకకి శ్రీచైతన్య స్కూల్స్ మెహిదీపట్నం జోన్ ఏజీఎం కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కోరారు. ప్రిన్సిపల్ ఎన్.స్వాతి మాట్లాడుతూ–‘‘విద్యార్థులకు క్రీడలు ఎంతో అవసరం. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, ఉత్సాహం కలుగుతుంది. విద్యా వికాసానికి ఆటలు అనేవి దోహద పడతాయి. ప్రతి ఒక్కరూ క్రీడల్లోనూ ప్రతిభ చాటాలి’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాల కో ఆర్డినేటర్ జనార్ధన్, డీన్ మల్లేశ్, ఇంచార్జ్‌లు బాలరాజు, ఆంజనేయులు, పల్లవి, హర్‌మిత్ సింగ్, పీఈటీలు కృష్ణ, అనిత, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.