Skip to content
మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం Telugu News

మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం బి. కృష్ణ, ఆర్‌ఐ–ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పలు యోగా ఆసనాలు వేశారు. ఈ నేపథ్యంలో ఏజీఎం బి.కృష్ణ, ఆర్‌ఐ–ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ–‘‘యోగా అనేది మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని సాధించడానికి మార్గం చూపుతుంది. యోగా కేవలం వ్యక్తిగత జీవనశైలికే కాకుండా ప్రపంచం మెరుగైన భవిష్యత్తుకు ఎంతో అవసరం. అదేవిధంగా సమతుల్యత, ఆత్మజ్ఞానం, అంతర్గత స్థిరత్వాన్ని యోగా పెంపొందిస్తుంది. సమతుల్య వ్యక్తిగత జీవనశైలికి యోగా ఎంతో అవసరం. అన్ని వయసుల వారు ఈ సంప్రదాయాన్ని ఆచరించవచ్చు. పని, పోషణ, నిద్రలతో…

Read more
F copy

ఘనంగా క్రీడా దినోత్సవం

మెహిదీపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో వారం రోజులుగా క్రీడా దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌ చంద్‌ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు క్రీడా పోటీలు నిర్వహించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్ని ప్రదర్శించారు. క్రీడా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శనివారం నిర్వహించిన ముగింపు వేడుకకి శ్రీచైతన్య స్కూల్స్‌ మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కోరారు. ప్రిన్సిపల్‌ ఎన్‌.స్వాతి మాట్లాడుతూ–‘‘విద్యార్థులకు క్రీడలు ఎంతో అవసరం. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, ఉత్సాహం కలుగుతుంది. విద్యా వికాసానికి ఆటలు అనేవి దోహద పడతాయి. ప్రతి ఒక్కరూ క్రీడల్లోనూ ప్రతిభ చాటాలి’’ అని చెప్పారు…

Read more