Skip to content

పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో స్మార్ట్‌ లివింగ్‌లో భాగంగా ‘మిషన్‌ హరితోదయ’ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మొక్కలు చేతబూని, ‘పర్యావరణాన్ని కాపాడుకుందాం.. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత’ అంటూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను తామే తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం బి. కృష్ణ, ఆర్‌ఐ ఎన్‌. స్వాతి మాట్లాడుతూ– ‘‘పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాలంలే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలి. ప్రకృతిని కాపాడితేనే భవిష్యత్‌ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించగలం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కోఆర్డినేటర్‌ జనార్ధన్, డీన్‌ మల్లేష్, ఇన్‌చార్జెస్‌ యాదగిరి, అరుణ, ఉపాధ్యాయులు,…

Read more
F copy

ఘనంగా క్రీడా దినోత్సవం

మెహిదీపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో వారం రోజులుగా క్రీడా దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌ చంద్‌ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు క్రీడా పోటీలు నిర్వహించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్ని ప్రదర్శించారు. క్రీడా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శనివారం నిర్వహించిన ముగింపు వేడుకకి శ్రీచైతన్య స్కూల్స్‌ మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కోరారు. ప్రిన్సిపల్‌ ఎన్‌.స్వాతి మాట్లాడుతూ–‘‘విద్యార్థులకు క్రీడలు ఎంతో అవసరం. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, ఉత్సాహం కలుగుతుంది. విద్యా వికాసానికి ఆటలు అనేవి దోహద పడతాయి. ప్రతి ఒక్కరూ క్రీడల్లోనూ ప్రతిభ చాటాలి’’ అని చెప్పారు…

Read more