Skip to content

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “అదే నీవు అదే నేను” నుంచి సాంగ్ రిలీజ్

త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “అదే నీవు అదే నేను” సినిమా

“కమిటీ కుర్రోళ్లు” మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, “సిద్ధార్థ్ రాయ్” సినిమా ఫేమ్ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా “అదే నీవు అదే నేను”. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్ పై గోవిందు కాండ్రేగుల నిర్మిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో యువ దర్శకుడు కొండల్ రూపొందిస్తున్నారు. “అదే నీవు అదే నేను” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘మనసా మనసా’ సాంగ్ ను స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ లాంఛ్ చేశారు. ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ ఈ చిత్రంలోని పాటలను రిలీజ్ చేస్తోంది. ఈ చిత్రంలోని పాటలు నచ్చి ఆదిత్య మ్యూజిక్ ఆడియో రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చింది. తమ మూవీలోని సాంగ్ లాంఛ్ చేసి తమకు సపోర్ట్ చేస్తున్న వినాయక్ గారికి ప్రొడ్యూసర్ గోవిందు కాండ్రేగుల, డైరెక్టర్ కొండల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా

డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ – కొండల్ ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేస్తూ “అదే నీవు అదే నేను” సినిమా రూపొందిస్తున్నారు. ఈ మూవీ ఆయనకు మంచి పేరు తీసుకురావాలి. గోవింద్ గారికి నిర్మాతగా తొలి చిత్రమిది. ప్రొడ్యూసర్ గా గోవింద్ గారు ఈ సినిమా విజయాన్ని అందుకుని, మరిన్ని మూవీస్ చేయాలి. మనసా మనసా సాంగ్ చాలా బాగుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

“అదే నీవు అదే నేను” చిత్రంలోని ‘మనసా మనసా’ పాటను డైరెక్టర్ కొండల్ బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఈ పాట రొమాంటిక్ గా సాగినా, ఎవరికీ ఇబ్బంది కలిగించనంత సెన్సబుల్ గా పొయెటిక్ గా రూపొందించడం విశేషం. ఈ పాటకు పూర్ణాచారి లిరిక్స్ రాయగా, మ్యూజిక్ డైరెక్టర్ కనిష్క రిపీటెడ్ గా వినేలా మంచి ట్యూన్ తో కంపోజ్ చేశారు. టాప్ సింగర్ జావెద్ అలీ తన సహజమైన శైలిలో అద్భుతంగా పాడారు. కొరియోగ్రాఫర్ వేద క్యూట్ డ్యాన్స్ మూవ్ మెంట్స్ తో కొరియోగ్రాఫ్ చేశారు. ఈ పాటలో హీరో హీరోయిన్స్ త్రినాథ్ వర్మ, తన్వీ నేగి మధ్య అందమైన కెమిస్ట్రీ, డీవోపీ నిమ్మల జయపాల్ రెడ్డి కలర్ ఫుల్ విజువల్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి.

‘మనసా మనసా’ పాట ఎలా ఉందో చూస్తే – ఎన్నెన్నె ఎన్నెన్నె వర్ణాలు ఉన్నా, నువు లేని వెలితేదో మిగిలున్నదే, ఇన్నాళ్లకైనా నిన్ను చూశాను అన్న ఆనందం నా సొంతమే. మారిందే వరసా, నీకైన తెలుసా ఈ కొత్త గమ్మత్తు బాగున్నదే, బంగారు సొగసా, నీ లేత స్పర్శ, ఎన్నెన్నో మాటల్ని చెబుతున్నదే, తుళ్లిపడకే మనసా మనసా మనసా మనసా కలలా కలిశానులే, ఉన్నట్టుండి వెతికే మలుపే దొరికే మరలా ప్రణయాలు మొదలయ్యెనే, ఉండిపోవే చెలియా చెలియా, చెలియా, చెలియా నీ తీరమే నేను లే, నీకు నాకు ముందే రాసి ఉంచారేమో, నిను వీడి పోలేనులే…అంటూ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగుతుందీ పాట.

నటీనటులు – త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వి నేగి, సహర్ కృష్ణన్, కల్పలత, సునయన, బిత్తిరి సత్తి, మీర్, సూర్యతేజ, నరేందర్, రమణ భార్గవ్, తదితరులు

టెక్నికల్ టీమ్
——————————
ఆర్ట్ డైరెక్టర్ – నార్ని శ్రీనివాస్
లిరిక్స్ – పూర్ణాచారి
డైలాగ్స్ – వై.అమ్మిరాజు
డీవోపీ – నిమ్మల జయపాల్ రెడ్డి
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
మ్యూజిక్ – కనిష్క
ప్రొడ్యూసర్ – కాండ్రేగుల గోవిందు
స్క్రిప్ట్, డైరెక్షన్ – కొండల్

Photos Link – https://we.tl/t-kjRdZ13cZChTst0N

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.