Skip to content

‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ చూసి మహేష్ బాబు గారు అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు: హీరో జై కృష్ణ ఘట్టమనేని

అశ్విని దత్ సమర్పణలో, పి. కిరణ్ చందమామ కథలు బ్యానర్ నిర్మాణంలో జై కృష్ణ ఘట్టమనేని, రాషా తడాని, అజయ్ భూపతి ‘శ్రీనివాస మంగాపురం’ లవ్, ఇంటెన్స్ ఎమోషన్స్, పవర్ ఫుల్ యాక్షన్ థియేట్రికల్ ట్రైలర్‌ లాంచ్

సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని ఈ చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తోంది. సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్నారు. పి. కిరణ్ నిర్మించి, అశ్విని దత్ సమర్పిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. ప్రతి అప్‌డేట్‌కు గొప్ప స్పందన లభిస్తోంది. తాజాగా నిర్మాతలు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

శ్రీనుకు మంగా అంటే ప్రాణం. మొదట అతని ప్రేమను అంగీకరించని మంగా, అతని నిజమైన ప్రేమను చూసి చివరకు ప్రేమలో పడుతుంది. ఇద్దరి ప్రేమ అందంగా సాగుతున్న సమయంలో బళ్లారి రాజు వెంకటప్పయ్య నాయుడు వారి జీవితాల్లోకి వస్తాడు. వారి ప్రేమకు అతడే అతిపెద్ద అడ్డంకిగా మారతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వారి ప్రేమ గెలిచిందా? అనేదే సినిమా కథ.

ప్రేమ కథలను తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు అజయ్ భూపతి, ఈ చిత్రాన్ని ప్రేమ, యాక్షన్, బలమైన భావోద్వేగాలతో కూడిన రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా అద్భుతంగా రూపొందించారు. ట్రైలర్ సినిమా అసలు కాన్సెప్ట్‌ను ఆసక్తికరంగా పరిచయం చేస్తూ, కథపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

తొలి సినిమాతోనే జై కృష్ణ ఘట్టమనేని ఆదరగొట్టారు. స్క్రీన్‌పై చాలా సహజంగా కనిపించడమే కాకుండా, డైలాగ్ డెలివరీ, హావభావాలు, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. ప్రేమ సన్నివేశాల్లో చక్కటి హావభావాలు చూపించిన ఆయన, యాక్షన్ సన్నివేశాల్లో కూడా మంచి ఇంటెన్సిటీని ప్రదర్శించారు.

రాషా తడానీ తన అందమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు నటనతో కూడా ఆకట్టుకున్నారు. జై కృష్ణ, రాషా మధ్య కెమిస్ట్రీ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విలన్‌గా డాక్టర్ మోహన్ బాబు తన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రతి సన్నివేశంలో ప్రత్యేకంగా కనిపించారు.

టెక్నికల్‌గా కూడా సినిమా ఉన్నత ప్రమాణాలతో రూపొందింది. జయకృష్ణ ఐఎస్‌సీ అందించిన విజువల్స్ ప్రేమ, యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా చూపించాయి. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మంచి బలం చేకూర్చింది. మాధవ్ కుమార్ గుల్లపాటి ఎడిటింగ్ ట్రైలర్‌ మరింత గ్రిప్పింగ్ గా ప్రజెంట్ చేసింది. సాహి సురేష్ రూపొందించిన సెట్స్ సినిమాకు మరింత గ్రాండ్ లుక్ తీసుకొచ్చాయి.

‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ ప్రేమ, యాక్షన్, భావోద్వేగాలతో ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై ట్రైలర్ మరింత ఆసక్తిని పెంచింది.

విజయవాడలో గ్రాండ్ గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో జై కృష్ణ మాట్లాడుతూ…అందరికీ నమస్కారం. మా తాతగారు సూపర్ స్టార్ కృష్ణ గారు లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. ఆయన నాకు దేవుడితో సమానం. అలాగే మా బాబాయ్ మహేష్ బాబు గారు కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. మా సినిమా టీజర్, ట్రైలర్ అన్నీ చూసి నాకు ఎంతో మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థాంక్ యూ బాబాయ్. మా నాన్నగారి గురించి మాట్లాడితే చాలా ఎమోషనల్ అవుతాను. ఆయన ఈ రోజు ఉండి ఉంటే చాలా సంతోషపడేవారు. ఎక్కడ ఉన్నా నన్ను చూసి ఆనందపడుతున్నారని నమ్ముతున్నాను. ‘శ్రీనివాస మంగాపురం’ కోసం దర్శకుడు అజయ్ భూపతి గారు అద్భుతమైన కథ రాశారు. సినిమాను కూడా చాలా అద్భుతంగా తీశారు. ఇందులోని ఎమోషన్స్, పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. జీవీ ప్రకాష్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమా మీకు మంచి థియేటర్ అనుభూతిని ఇస్తుంది. విజువల్స్, మ్యూజిక్ అన్నీ కొత్తగా ఉంటాయి. రాషా తడానీ చక్కగా నటించింది. ఆమె నటనను ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తారు. మోహన్ బాబు గారు మా సినిమాలో చాలా మంచి పాత్ర చేశారు. మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి చాలా ఆనందంగా ఉంది. జూలై 30న అందరూ థియేటర్లకు వచ్చి ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా చూడండి. తప్పకుండా మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. మా నిర్మాతలకు ధన్యవాదాలు. అలాగే చిన్నప్పటి నుంచి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన మా బంగారు తాతయ్యకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ థాంక్యూ సో మచ్.

హీరోయిన్ రాషా తడానీ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. తెలుగు సినిమాలో తొలిసారి నటించడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు అజయ్ భూపతి గారికి, నిర్మాత కిరణ్ గారికి ధన్యవాదాలు. నా కో-స్టార్ జై కృష్ణ ఎంతో సహకరించారు. జూలై 30న మీరందరూ థియేటర్లలో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను తప్పకుండా చాలా ఎంజాయ్ చేస్తారు.

దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. జై కృష్ణను చూస్తే తొలి సినిమా చేస్తున్న హీరోలా అనిపించడు. ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్‌ను విజయవాడలో విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. జై కృష్ణ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఆయనకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. ‘మంగా మంగా’ పాట మీ అందరికీ ఎంత నచ్చిందో నాకు తెలుసు. మిగతా పాటలన్నీ కూడా అద్భుతంగా వచ్చాయి. ఫైట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సినిమాలో మోహన్ బాబు గారు ఉన్నారు. రగ్గడ్ యాక్షన్‌తో పాటు అద్భుతమైన ప్రేమకథ కూడా ఉంటుంది. యూత్‌కు ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఈ ఉదయం ట్రైలర్‌ను మహేష్ బాబు గారికి పంపించాను. ఆయన “సూపర్” అని రిప్లై ఇచ్చారు. నాలుగు లవ్ ఎమోజీలు కూడా పంపించారు. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నేను ఎప్పుడూ ఫ్యాన్స్‌ను టార్గెట్ చేసి సినిమా చేయలేదు. కానీ ఈ సినిమా మాత్రం ఫ్యాన్స్‌ కోసం తీశాను. జై కృష్ణ నటన, సినిమాలోని పెర్ఫార్మెన్స్,యాక్షన్… అన్నీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి.

ఘట్టమనేని ఆది శేషగిరిరావు మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. కృష్ణ గారికి, మహేష్ బాబు గారికి విజయవాడలో ఎంత అభిమానం ఉందో అందరికీ తెలుసు. మా కుటుంబానికి అప్సర థియేటర్‌తో ఐదు దశాబ్దాల అనుబంధం ఉంది. ఈ వేడుకను ఇంత అద్భుతంగా నిర్వహించిన అందరికీ ధన్యవాదాలు. ట్రైలర్‌లో చూసినట్టుగానే సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అజయ్ భూపతి గారు సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. రాషా తడానీ చాలా బాగా నటించింది. జై కృష్ణ చాలా అందంగా కనిపించడమే కాదు, అద్భుతంగా నటించాడు. నిర్మాత కిరణ్, అశ్వినీ దత్ గారికి ప్రత్యేక అభినందనలు. ఈ వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. కృష్ణ గారి అభిమానులకు, మహేష్ బాబు గారి అభిమానులకు, జై కృష్ణను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఒకప్పుడు కృష్ణ గారిని సూపర్ స్టార్‌గా ఆదరించింది విజయవాడ. తర్వాత మహేష్ బాబు గారిని కూడా అదే స్థాయిలో అభిమానించింది. ఇప్పుడు జై కృష్ణను కూడా మరో సూపర్ స్టార్‌గా నిలబెట్టాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ప్రారంభోత్సవం విజయవాడలో జరిగింది. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ కూడా ఇక్కడే జరుగుతోంది. సినిమా కూడా భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. జై కృష్ణ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ‘శ్రీనివాస మంగాపురం’ ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.

బుద్ధా వెంకన్న మాట్లాడుతూ…అందరికీ నమస్కారం. సూపర్ స్టార్ కృష్ణ గారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఈ థియేటర్‌లో ప్రదర్శితమయ్యాయి. జై కృష్ణ తొలి సినిమా వేడుక కూడా ఇక్కడ జరగడం చాలా ఆనందంగా ఉంది. ఆది శేషగిరిరావు గారు, కిరణ్ గారు, అశ్విని దత్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు అజయ్ భూపతి కూడా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. జై కృష్ణ సూపర్ స్టార్‌గా ఎదగాలని, మన అందరి ఆశీస్సులు ఆయనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

నటీనటులు: జై కృష్ణ ఘట్టమనేని, రాషా తడాని, మోహన్ బాబు

సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: అజయ్ భూపతి
సమర్పణ: అశ్విని దత్
నిర్మాత: పి.కిరణ్
బ్యానర్: చందమామ కథలు
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
DOP: జయకృష్ణ ISC
ఎడిటర్: మాధవ్ కుమార్ గుళ్లపాటి
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
Ex-Producer: సాకమూరి నారాయణ స్వామి
ఫైట్స్: రియల్ సతీష్
PRO: వంశీ-శేఖర్

Pics Event – https://transfer.it/t/sHYUXbhFxZYD

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.