అశ్విని దత్ సమర్పణలో, పి. కిరణ్ చందమామ కథలు బ్యానర్ నిర్మాణంలో జై కృష్ణ ఘట్టమనేని,…
“రణబాలి” సినిమా సెట్స్ నుంచి ఇంట్రెస్టింగ్ వర్కింగ్ స్టిల్ షేర్ చేసిన హీరోయిన్ రశ్మిక మందన్న

-“రణబాలి” చిత్రాన్ని తెరపై చూసేందుకు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నానంటూ రశ్మిక ఇన్ స్టా పోస్ట్
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా “రణబాలి” సినిమా రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కు అన్ని సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉందీ మూవీ. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ స్టిల్ షేర్ చేశారు హీరోయిన్ రశ్మిక మందన్న. “రణబాలి” సినిమాలో విజయ్ నటిస్తున్న ఇంటెన్స్ సీన్ స్టిల్ తో ఆమె చేసిన ఇన్ స్టా పోస్ట్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ ఇన్ స్టా పోస్ట్ లో రశ్మిక స్పందిస్తూ – ఈ స్టిల్ ఇప్పుడే మీతో షేర్ చేసుకోవచ్చో లేదో తెలియదు. గతంలో ఎన్నోసార్లు చెప్పినట్లు ఈ పోస్ట్ ను కూడా తొలగించమని వారు నన్ను అడగరని భావిస్తున్నా. కానీ రణబాలి టీమ్ మాత్రం ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ ప్రపంచాన్ని తెరపై చూసేందుకు ఆత్రుతగా వేచి చూస్తున్నా. అని అన్నారు. రణబాలి చిత్రంలో రశ్మిక జయమ్మ అనే పాత్రలో రణబాలికి జోడీగా కనిపించబోతున్నారు.
నటీనటులు – విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ, తదితరులు
టెక్నికల్ టీమ్
—————–
బ్యానర్ – మైత్రీ మూవీ మేకర్స్
సమర్పణ – గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్
ప్రొడ్యూసర్స్ – నవీన్ యెర్నేని, రవిశంకర్
స్టోరీ, డైరెక్షన్ – రాహుల్ సంకృత్యన్
కో ప్రొడ్యూసర్స్- అనురాగ్ పర్వతనేని, శివ్ చనన
సీఈవో – చెర్రి
మ్యూజిక్ – అజయ్ – అతుల్
డీవోపీ – నీరవ్ షా, జిష్ణు భట్టాజిష్ణు భట్టాచర్జీ
రైటర్ – ప్రమోద్ తమ్మినేని
ప్రొడక్షన్ డిజైనర్ – శివం రావు నాగసాని
ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్ ఆర్
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఆర్ చంద్రశేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – చెంబోలు సాయి ఆదిత్య
కొరియోగ్రఫీ – కృతి మహేశ్
కాస్ట్యూమ్ డిజైనర్ – అర్చన రావు
ఆర్ట్ డైరెక్టర్ – విఠల్ కోసనం
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – సునీల్ రాజు చింత
యాక్షన్ కొరియోగ్రాఫర్స్ – యెన్నిక్ బెన్, ఆండీ లాంగ్ గ్యుయెన్, రాబిన్ సుబ్బు
సౌండ్ డిజైనర్ – రఘునాథ్ కెమిశెట్టి
పబ్లిసిటీ డిజైనర్ – కబిలన్ చెల్లయ్య
పీఆర్ఓ – సురేష్ ( ఎస్ కె మీడియా )
మార్కెటింగ్ – ఫస్ట్ షో

