Skip to content

పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో స్మార్ట్‌ లివింగ్‌లో భాగంగా ‘మిషన్‌ హరితోదయ’ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మొక్కలు చేతబూని, ‘పర్యావరణాన్ని కాపాడుకుందాం.. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత’ అంటూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను తామే తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం బి. కృష్ణ, ఆర్‌ఐ ఎన్‌. స్వాతి మాట్లాడుతూ– ‘‘పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాలంలే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలి. ప్రకృతిని కాపాడితేనే భవిష్యత్‌ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించగలం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కోఆర్డినేటర్‌ జనార్ధన్, డీన్‌ మల్లేష్, ఇన్‌చార్జెస్‌ యాదగిరి, అరుణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.