మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'కొరియన్…
మెహదీపట్నం శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా బి.ఎస్. రావు 3వ వర్ధంతి
శ్రీ చైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, ప్రముఖ విద్యావేత్త, దార్శనికుడు బి.ఎస్. రావు 3వ వర్ధంతిని మెహదీపట్నం శ్రీ చైతన్య స్కూల్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్ ఏజీఎం బి. కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ–‘‘ బి.ఎస్. రావుగారి ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలి’’ అని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని బి.ఎస్.రావు ఆదర్శాలు, విద్య పట్ల వారి అంకితభావాన్ని ప్రతిబింబించే అందమైన చిత్రాలను రూపొందించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. ఈ కార్యక్రమంలో మెహదీపట్నం శ్రీ చైతన్య స్కూల్ ఆర్, ప్రిన్సిపాల్ ఎన్. స్వాతి, కోఆర్డినేటర్ జనార్ధన్, డీన్ శ్రీ మల్లేష్, ఇన్‌చార్జెస్ యాదగిరి, అరుణతో పాటు టీచర్లు, విద్యార్థులు బి.ఎస్. రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.




