Skip to content

ప్రపంచంలోని తెలుగు వారందరినీ అబ్బురపరిచేలా Keinfra Properties GAMA 5th ఎడిషన్ ఈవెంట్ నిర్వహిస్తున్నాం : గామా సీఈవో సౌరబ్ కేసరి

ప్రపంచంలోని తెలుగు వారందరినీ అబ్బురపరిచేలా Keinfra Properties  GAMA 5th ఎడిషన్ ఈవెంట్  నిర్వహిస్తున్నాం  : గామా సీఈవో సౌరబ్ కేసరి Telugu News
ప్రపంచంలోని తెలుగు వారందరినీ అబ్బురపరిచేలా Keinfra Properties  GAMA 5th ఎడిషన్ ఈవెంట్  నిర్వహిస్తున్నాం  : గామా సీఈవో సౌరబ్ కేసరి Telugu News

అవార్డ్స్ అనేవి నటీనటులకు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ లాంటివి : ప్రముఖ దర్శకులు ఏ కోదండరామిరెడ్డి

ఈసారి మరింత స్పెషల్ గా గామా అవార్డ్స్ జరగబోతున్నాయి : ప్రముఖ దర్శకులు బి గోపాల్

ప్రతిష్టాత్మమైన GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ కు టాలీవుడ్‌లో స్పెషల్ క్రేజ్ ఉంది. దుబాయ్‌లో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇప్పుడు 5వ ఎడిషన్ వేడుకలు ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌‌లో గ్రాండ్‌గా జరగనుంది. ఈ అవార్డ్స్ కార్యక్రమానికి టైటిల్స్ స్పాన్సర్ గా వైభవ్ జ్యువెలర్స్ సంస్థ వ్యవహరిస్తోంది.

ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లో కర్టెన్ రైజర్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గామా సీఈవో సౌరబ్ కేసరి, వైభవ్ జ్యువెలర్స్ ఎండి రాఘవ్, జ్యూరీ సభ్యులు, ప్రముఖ దర్శకులు ఏ. కోదండరామిరెడ్డి గారు, బి గోపాల్ గారు, హీరోయిన్స్ ఫరియా అబ్దుల్లా, మానస వారణాసి, దక్షా నాగర్కర్, నటుడు వైవా హర్ష పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గామా సీఈవో సౌరబ్ కేసరి మాట్లాడుతూ.. “ఇది కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈవెంట్ కాదు. మా నాన్న (త్రిమూర్తులు) గారికి కళాకారులపై ఉన్న అభిమానం తో గామా అవార్డ్స్ నిర్వహిస్తున్నాం. అందరి సపోర్ట్ తో ముందుకు వెళ్తున్నాం. వచ్చే ఏడాది మరింత గ్రాండ్ గా అవార్డ్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఇతర దేశాల్లోను గామా అవార్డ్స్ ఇచ్చేలా సన్నాహాలు చేస్తున్నాం. దుబాయ్ లో ఉన్న తెలుగు వారితోపాటు ప్రపంచంలోని తెలుగు వారందరినీ అబ్బురపరిచేలా ఈవెంట్ ను నిర్వహించబోతున్నాం. మా జ్యూరీ సభ్యుల సహకారంతో అవార్డు విజేతలను ఎంపిక చేశాం” అని అన్నారు.

జ్యూరీ సభ్యులు, ప్రముఖ దర్శకులు ఏ కోదండ రామిరెడ్డి గారు మాట్లాడుతూ.. ” ఈ అవార్డ్స్ లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నేను, బి గోపాల్, కోటి సహా పలువురు ప్రముఖులు కూడా జ్యురీ సభ్యులుగా వ్యవహరిస్తున్నాం. ఇలాంటి అవార్డ్స్ నటీనటులకు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ లాంటివి. ప్రతి ఒక్కరినీ ఎంకరేజ్ చేసేలా ఉంటాయి. ఆగస్టు 30న దుబాయ్ లో జరగనున్న ఈ గామా అవార్డ్స్ విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నా” అని అన్నారు.

జ్యూరీ సభ్యులు, ప్రముఖ దర్శకులు బి గోపాల్ గారు మాట్లాడుతూ.. ” గామా అవార్డ్స్ చైర్మన్ త్రిమూర్తులు గారు ఈ అవార్డ్ ఫంక్షన్ ను ప్రతి ఏడాది చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా అంతకుమించేలా సౌరబ్ కేసరి అన్ని ఏర్పాట్లు చేశారు. అతిరథ మహారధుల సమక్షంలో హీరోయిన్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ లతో
ఈ ఈవెంట్ జరగనుంది” అని చెప్పారు.
గామా అవార్డ్స్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న వైభవ్ జ్యువెలర్స్ ఎండి రాఘవ్ మాట్లాడుతూ.. ” ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డ్స్ లో భాగమవడం సంతోషంగా ఉంది.

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ..” గతేడాది జరిగిన ఫోర్త్ ఎడిషన్ గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫార్మన్స్ చేశాను ఈసారి కూడా స్పెషల్ పెర్ఫార్మన్స్ తో అలరించబోతున్నా” అని చెప్పారు.
హీరోయిన్ మానస వారణాసి మొదటిసారి గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫార్మన్స్ చేయబోతున్నారని చెప్పారు. ఈ వేడుకలో పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉందని హీరోయిన్ దక్షా నాగర్కర్ అన్నారు.
గామా అవార్డ్స్ లో యాంకర్ సుమతో పాటు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న నటుడు వైవా హర్ష మాట్లాడుతూ.. ” సుమ గారితో వ్యాఖ్యాతిగా వ్యవహరించడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది.ఈ వేడుక చాలా ఎంటర్టైనింగ్ గా జరగబోతుంది” అని చెప్పారు.

ఇప్పటికే దుబాయ్ లో లాంచ్ చేసిన గామా 5th ఎడిషన్ కు సంబంధించి థీమ్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు ఈ పాటకు అద్భుతమైన ఆకట్టుకునే సాహిత్యం అందించారు. రఘు కుంచె సాంగ్ కంపోజ్ చేయడంతో పాటు తానే స్వయంగా పాడిన తీరు అందరినీ అలరించింది.

ఆగస్టు 30న టాలీవుడ్ అవార్డ్స్ తో పాటు ఆగస్టు 29న ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకను నిర్వహించేలా భారీ సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జ, కిరణ్ అబ్బవరం, శ్రీ విష్ణు, రోషన్.. హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, దక్ష నాగర్కర్ తో పాటు.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అగ్ర కథానాయకులు, టాప్ టెక్నీషియన్స్ పాల్గొనబోతున్నారు.
అలాగే హీరోయిన్స్ ఊర్వశి రౌతేలా, కేతిక శర్మ, ఫరియా అబ్దుల్లా, ప్రియా హెగ్డే, శ్రీదేవి స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో అలరించనున్నారు.

ప్రత్యేక అతిధులుగా బ్రహ్మానందం, దర్శకులు సుకుమార్, బుచ్చిబాబు, బాబీ, సాయి రాజేష్, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, నిర్మాతలు అశ్విని దత్, డివివి దానయ్య, చంద్రబోస్, వెన్నెల కిషోర్ తదితర ప్రముఖులు హాజరవనున్నారు. వీరితో పాటు పలువురు టాలీవుడ్ అగ్రశ్రేణి నటీనటులు సర్ ప్రైజ్ గెస్ట్ లుగా హాజరు కానున్నారు.
అతిరథ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా జరగనున్న ఈ అవార్డ్స్ వేడుక కోసం చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టాలీవుడ్ 24 క్రాఫ్ట్స్ కు ఈ అవార్డ్స్ ను అందించనున్నారు. 2024లో విడుదలైన చిత్రాల్లో నామినేటె అయిన విభాగాలకు జ్యూరీ సభ్యుల ద్వారా అవార్డులను అందుకోనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత, కళా రంగ ప్రముఖులు, ప్రతిభావంతులు, సినీ పరిశ్రమకు చెందిన లెజెండ్స్ ఈ గామా అవార్డ్స్ 2025 లో పాల్గొననున్నారు. ఈ ఏడాది కూడా పలు పాపులర్ చిత్రాలు, స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్స్, టాప్ టెక్నీషియన్స్ గామా అవార్డులను అందుకోనున్నారు.

గామా అవార్డ్స్ 2025 జ్యూరీ చైర్ పర్సన్స్ ప్రముఖ సినీ దర్శకులు – ఏ. కొదండ రామిరెడ్డి , ప్రముఖ సంగీత దర్శకులు – కోటి , ప్రముఖ సినీ దర్శకులు – బి. గోపాల్ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్ కళాకారులకు, సినిమాలకు GAMA అవార్ద్స్ బహుకరించబడతాయి.

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.