Skip to content

‘మార్గన్’ నుంచి ‘సోల్ ఆఫ్ మార్గన్’ సాంగ్ రిలీజ్

Vijay antony

హీరోగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా, ఎడిటర్‌గా ఇలా మల్టీ టాలెంటెడ్ అయిన విజయ్ ఆంటోని ‘మార్గన్’ అంటూ జూన్ 27న ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. విజయ్ ఆంటోని నటిస్తూ, నిర్మించిన ‘మార్గన్’ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బానర్ పై జె.రామాంజనేయులు సగర్వంగా సమర్పిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా సినిమాపై అంచనాల్ని పెంచేశాయి.

జూన్ 27న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా సోల్ ఆఫ్ మార్గన్ అంటూ ఓ పాటను రిలీజ్ చేశారు. ‘చెప్పలేని ద్వేషముందే జగతిపై’ అంటూ సాగే ఈ ‘సోల్ ఆఫ్ మార్గన్’ను చూస్తే సినిమాకు సంబంధించిన ఎన్నో హింట్స్‌ను ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. భాష్య శ్రీ రచించిన ఈ పాటను అక్షర ఆలపించారు. విజయ్ ఆంటోనీ బాణీ వెంటాడేలా, సినిమా థీమ్‌ను చాటేలా ఉంది.

ఈ చిత్రంలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి యువ.ఎస్ సినిమాటోగ్రఫర్‌గా, విజయ్ ఆంటోని స్వయంగా సంగీతం సమకూర్చగా.. రాజా.ఎ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు.

తారాగణం: విజయ్ ఆంటోని, అజయ్ ధీషన్, సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి మరియు అంతగారం నటరాజన్

సాంకేతిక సిబ్బంది
రచయిత, దర్శకుడు: లియో జాన్ పాల్
నిర్మాత: విజయ్ ఆంటోని ఫిల్మ్స్ కార్పొరేషన్
ప్రెజెంట్స్: సర్వాంత్ రామ్ క్రియేషన్స్, జె.రామాంజనేయులు
సంగీతం: విజయ్ ఆంటోని
సినిమాటోగ్రఫీ: యువ ఎస్
ఆర్ట్ డైరెక్టర్: రాజా ఎ
PRO: సాయి సతీష్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.