Skip to content

రామ్‌చరణ్‌ ట్రైన్‌ యాక్షన్‌ బ్లాక్‌ షూటింగ్‌

Ramchan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్ తో దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పవర్ ఫుల్ కొలాబరేషన్, అద్భుతమైన టీంతో ‘పెద్ది’ భారతీయ సినిమాలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే చిత్రం యూనిట్, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో కీలక సన్నివేశాలతో పాటు ఓ భారీ యాక్షన్ బ్లాక్‌ను పూర్తి చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్మించిన మ్యాసీవ్ సెట్లో భారత సినిమా చరిత్రలో ఎన్నడూ లేనంత అద్భుతమైన యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ జరుగుతోంది.

ఇది ఇండియన్ యాక్షన్ సినిమాల ప్రమాణాలను పెంచేలా ఉన్న హై-ఆక్టేన్, హై బడ్జెట్‌తో రూపొందిస్తున్న ట్రైన్ ఎపిసోడ్. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా అద్భుతంగా సెట్స్ ని డిజైన్ చేశారు. ఈ ట్రైన్ స్టంట్ కోసం రూపొందించిన సెట్స్ కన్నులకు పండుగగా ఉండబోతున్నాయి. ఈ ఎపిసోడ్‌లో రామ్ చరణ్ తన కెరీర్‌లోనే అత్యంత రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనుంది.

పుష్ప 2 వంటి చిత్రాల్లో తన వర్కింగ్ స్టయిల్ తో ఆకట్టుకున్న నబాకాంత్ మాస్టర్ ఈ యాక్షన్ సీక్వెన్స్ కు కొరియోగ్రఫీ వహిస్తున్నారు. పెద్ది ఐకానిక్ క్రికెట్ షాట్‌ కి ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం పలు హై-ప్రొఫైల్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆయన, ఈ చిత్రంలోనే అత్యంత భారీగా రూపుదిద్దుకున్న యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కిస్తున్నారు.

ఈ మైండ్-బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో మేజర్ హైలైట్‌గా వుండబోతోంది.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

చిత్రానికి స్టార్ డివోపీ ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నవీన్ నూలి ఎడిటర్. వినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ చేశారు.

ఈ చిత్రం 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

తారాగణం: రామ్ చరణ్, జాన్వి కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బుచ్చి బాబు సానా
సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
సంగీతం: AR రెహమాన్
DOP: R రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: V. Y. ప్రవీణ్ కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్వో: వంశీ శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. We covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.