Skip to content

ఘాటిలో అనుష్క గారి విశ్వరూపం చూపించాం. మంచి కథ, పెర్ఫార్మెన్స్, స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో వస్తున్న ఘాటి తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది: ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి

క్వీన్ అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ఘాటి. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ…అందరికీ నమస్కారం. కొన్ని కథలు చాలా సహజంగా, పచ్చిగా, పేలడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంటాయి. ఘాటి అలాంటి కథ. తూర్పు కనుమలు, ఆ పర్వత శ్రేణులు అక్కడ ఉన్న ఒక తీవ్రమైన భావోద్వేగాలు చాలా గట్టి మనుషులు గొప్ప మనస్తత్వాలు ఇవన్నీ కలగలిపి ఒక మంచి కథ చెప్పడానికి ఆస్కారం దొరికింది. చింతకింద శ్రీనివాసరావు గారు గొప్ప రచయిత. మొదటిగా ఆయన నాకు ఈ ప్రపంచం గురించి చెప్పారు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. నేను స్వీటీ వేదం సినిమాలో కలిసి పనిచేశాం. అందులో సరోజ పాత్రను పోషించింది. ఇప్పుడు ఘాటిలో శీలావతిగా మనందరి ముందుకు రాబోతుంది. అరుంధతి, సరోజ, దేవసేన, భాగమతి.. ఇలా ఎన్నో ఐకానిక్ క్యారెక్టర్స్ అనుష్క చేసింది. ఘాటిలో కూడా చాలా ఎక్స్ట్రార్డినరీగా చేసింది. తను సూపర్ స్టార్ డమ్ లో వుంది. వేదం నుంచి ఇప్పటివరకు స్టార్ డమ్ లో అనేక రెట్లు ఎదిగింది. తన మనసు మాత్రం అలాగే ఉంది. ఈ సినిమా కథ చెప్పగానే చాలా అడ్వంచర్ తో కూడుకున్న మూవీ తప్పకుండా చేద్దాం అని చెప్పింది. అనుష్క విశ్వరూ��