- ఆగస్ట్ 8న తమిళంలో స్ట్రీమింగ్.. 27 నుంచి తెలుగు, కన్నడల్లో స్ట్రీమింగ్ భారతదేశంలోని అతిపెద్ద…
ప్రైమ్ వీడియోలో హరి హర వీరమల్లు

పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త! ఆయన తాజా చిత్రం హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ vs స్పిరిట్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కి అందుబాటులోకి వచ్చింది..
ఈ చిత్రాన్ని రాధాకృష్ణ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించగా, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. పీరియడ్ అడ్వెంచర్ జానర్లో రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, సచిన్ ఖేడ్కర్, నాజర్, రఘుబాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు.
మొఘల్ కాలం నాటి ఈ కథలో, వీరమల్లు అనే ఒక ధైర్యవంతుడు చక్రవర్తి ఔరంగజేబు కోట నుండి ప్రసిద్ధ కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడానికి బయలుదేరుతాడు. రాజకీయ కుట్రలు, యుద్ధాలు మరియు సాహసాలతో ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. కాని కథ ముందుకు వెళ్ళే కొలది కథ ధర్మ రక్షణ కోసం అనే మలుపుతో మరింత ఇంట్రెస్ట్ కలిగించింది.
ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో కూడా అందుబాటులో ఉంది. మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ప్రైమ్ సభ్యులు ఈ సినిమాను చూడవచ్చు.