‘ఆల్ఫా’యాక్షన్ ఫిల్మ్ అద్భుతం! ఆలియా భట్‌తో యాక్షన్ థ్రిల్లింగ్‌గా అనిపించింది – బాబీ డియోల్
యశ్ రాజ్ ఫిల్మ్ రూపొందిస్తోన్న భారీ యాక్షన్ మూవీ ‘ఆల్ఫా’ లో నటించటం చాలా సరదాగా అనిపించిందని అంటున్నారు బాలీవుడ్ యాక్షన్ స్టార్ బాబీ డియోల్. వ్యక్తులను చంపటానికి శిక్షణ ఇచ్చి పెంచి పెద్ద చేసిన ఓ హంతకురాలి కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. మరో హీరోయిన్ శర్వారి కూడా నటిస్తోంది. ఇద్దరు హీరోయిన్స్ నటిస్తోన్న ఈ ఫుల్ యాక్షన్ మూవీ ఇండియాలో రూపొందటం చాలా సంతోషంగా ఉందని బాబీ అన్నారు. కచ్చితంగా ఈ ఆల్ఫా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాబీ డియోల్ మాట్లాడుతూ ‘‘నాకు రణ్‌భీర్ కపూర్, ఆలియా భట్…
