బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా…
*ఆగస్ట్ 28 నుంచి జీ5లో ‘బందర్’ స్ట్రీమింగ్
- కీలక పాత్రల్లో నటించిన సాన్యా మల్హోత్రా, సప్నా పబ్బీ, సబా ఆజాద్.. #MeTooForMen అనే వైవిధ్యమైన కథతో ఆరోపణలు, అభిప్రాయాలు, న్యాయం చుట్టూ సాగే సినిమా –
వైవిధ్యమైన కథాంశాలను ప్రేక్షకులకు అందించటానికి జీ5 ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు బందర్ అనే డిఫరెంట్ మూవీతో అలరించటానికి సిద్ధమైంది. వివాహ బంధంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోసం ఓ మహిళ చేసే పోరాటాన్ని ఆవిష్కరించిన ‘మిసెస్’ అనే సినిమా నుంచి.. అత్యాచార ఘటనలు, బాధితులనే నిందించడం, న్యాయం కోసం మహిళలు ఎదుర్కొనే సవాళ్లను ప్రశ్నించిన ‘అస్సి’ వరకు.. సంప్రదాయ మూస ధోరణులను అనుసరించడం కంటే వాటిని ప్రశ్నించే కథలకు హిందీ జీ5 ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. ఇప్పుడు ‘బందర్’తో నేటి సమాజంలో అత్యంత అసౌకర్యానికి గురిచేసే, వివాదాస్పదమైన చర్చల్లో ఉండే అంశమైన ఒకదానిని హిందీ జీ5 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. సాధారణంగా ..ఇన్నేళ్లుగా మహిళలు తమకు జరిగిన అన్యాయాలపై ధైర్యంగా గొంతెత్తిన కథలను మనం వింటూనే ఉన్నాం. అయితే ‘బందర్’ ఓ కీలకమైన, ఆలోచింపజేసే ప్రశ్నను లేవనెత్తుతోంది..అదే పురుషులు కూడా బాధితులుగా ఉండగలరా? అనే అంశమే.
#మీటూఫర్‌మెన్ అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ‘బందర్’.. ఓ మహిళ చేసిన ఆరోపణతో ఒక్కసారిగా తలకిందులైన ఓ వ్యక్తి జీవితాన్ని ఆవిష్కరిస్తుంది. నిజం బయటకు రాకముందే ప్రజల అభిప్రాయాలు, మీడియా పరిశీలన, సామాజిక తీర్పులు అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయనే విషయాలను ఈ చిత్రం ఆవిష్కరించింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాబీ డియోల్ పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో మెప్పించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని నిజం తెలియకముందే దోషిగా భావించినప్పుడు ఎదురయ్యే ఇబ్బందికరమైన పరిణామాలను ‘బందర్’ ఆవిష్కరిస్తుంది. ఒక ఆరోపణే శిక్షగా మారితే పరిస్థితులు ఎలా ఉంటాయనే ప్రశ్నను ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ‘బందర్’ ద్వారా హిందీ ZEE5.. ముందస్తు అభిప్రాయాలను ప్రశ్నించే, సంక్లిష్టమైన వాస్తవాలను ప్రతిబింబించే, చర్చల్లో తరచూ వినిపించకుండా మిగిలిపోయే కోణాలకు గొంతుకనిచ్చే కథలను అందించాలనే తన నిబద్ధతను కొనసాగిస్తోంది. ‘బోల్డ్ స్టోరీస్ లివ్ హియర్’ అనే తన విశ్వాసాన్ని మరోసారి జీ5 బలంగా చాటుతోంది.
‘బందర్’ కథ ఒకప్పుడు పాపులర్ టెలివిజన్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమర్ మెహ్రా చుట్టూ తిరుగుతుంది. మాజీ భాగస్వామి అతనిపై అత్యాచారం ఆరోపణలు చేయడంతో సమర్ జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుంది. ఈ ఆరోపణలు మీడియాలో పెద్ద దుమారం రేపడంతో పాటు, సుదీర్ఘమైన న్యాయ పోరాటానికి దారితీస్తాయి. నిజం ఏంటో నిగ్గు తేలక ముందే ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే పరిస్థితుల్లో.. సమర్ ఓ వ్యవస్థలో చిక్కుకుపోతాడు.
అధికారం, అంగీకారం, మీడియా పరిశీలన, న్యాయం వంటి అంశాల మధ్య ఉన్న సంబంధాలను ‘బందర్’ ఆవిష్కరిస్తుంది. పురుషులు కూడా బాధితులుగా ఉండగలరా? అనే కఠినమైన ప్రశ్నను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ఆరోపణలకు, ప్రజల అభిప్రాయాలకు, మీడియా ట్రయల్స్‌కు బాధితులుగా మారే పురుషుల పరిస్థితులను ఈ చిత్రం చర్చిస్తుంది. ఒక ఆరోపణ శిక్షగా మారినప్పుడు.. నిజం చెప్పే అవకాశం రాకముందే ఒక వ్యక్తిని దోషిగా నిర్ణయించడం వల్ల కలిగే పరిణామాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ‘బందర్’ ప్రశ్నిస్తుంది. నటీనటుల చక్కటి ప్రదర్శన, ఊహించని మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ గ్రిప్పింగ్ డ్రామా.. చివరి వరకు ప్రేక్షకులను ఆలోచింపజేస్తూ, అసలు నిజం ఏంటనే ప్రశ్నను ఆలోచింప చేసేలా చేస్తుంది.
* #మీటూ ఫర్ మెన్‌కు సంబంధించిన చర్చను ధైర్యంగా, సూటిగా ఆవిష్కరిస్తూ..ఇప్పటివరకు పెద్దగా కనిపించని ఓ కొత్త కోణాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న చిత్రం ‘బందర్’.
* అనుకోని పరిస్థితుల కారణంగా ఓ ఉచ్చులో చిక్కుకున్న ఓ వ్యక్తి కథను ఆవిష్కరిస్తూ.. చివరకు ఆరోపణే అతనికి శిక్షగా మారిన పరిస్థితులను కూడా ఈ సినిమాలో చూపించారు.
* ఆరోపణలు, ప్రజల అభిప్రాయాలు, మీడియా ట్రయల్స్.. నిజం చెప్పే అవకాశం రాకముందే తీర్పు ఇవ్వడం వల్ల మనిషి ఎదుర్కొనే మానసిక, సామాజిక వేదనను ‘బందర్’ సినిమా ఆవిష్కరిస్తుంది.
* ఒక అంశానికి సంబంధించి అన్నీ కోణాలను పూర్తిగా తెలుసుకోక ముందే సమాజం ఎంత వేగంగా ఓ నిర్ణయానికి వచ్చేస్తుందో ప్రశ్నించేలా.. మన ముందస్తు అభిప్రాయాలను మరోసారి ఆలోచించుకునేలా ‘బందర్’ ప్రేక్షకులను సవాలు చేస్తుంది.
* తన కెరీర్‌లో అత్యుత్తమైన నటనను కనబరుస్తోన్న బాబీ డియోల్‌కు ఇతర నటీనటుల నుంచి మరింత తోడ్పాటు లభించింది.
* భావోద్వేగభరితమైన డ్రామా, ఉత్కంఠ, సామాజిక అంశాలను మేళవిస్తూ.. నిజం, న్యాయం, సమానత్వం గురించి ప్రేక్షకుల్లో ఆలోచనలను రేకెత్తించేలా ఈ చిత్రం తెరకెక్కింది.
ఈ సందర్భంగా దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నేను నటించటానికి ప్రధాన కారణం.. సమాజం ఫేస్ చేయటానికి ఇబ్బందిపడే కొన్ని కఠినమైన ప్రశ్నలను ఇందులో సంధించారు. అందులో ముఖ్యమైన ప్రశ్న స్త్రీలే కాదు.. ‘పురుషులు కూడా బాధితులుగా ఉండగలరా?’ అనేది. నలుపు, తెలుపు అన్నట్లుగా స్పష్టమైన కోణాల్లో కాకుండా.. నిజ జీవితంలో తరచూ కనిపించే అసౌకర్యకరమైన బూడిద రంగు పరిస్థితులను కూడా పరిశీలించేలా ఈ చిత్రం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. ఏదైనా విషయంలో ఓ నిర్ణయాన్ని చెప్పే ముందు మనం నిజంగా ఎదుటివారి మాట వినేందుకు సిద్ధంగా ఉన్నామా? బాధపడే వ్యక్తి తత్వం, నిజం, సానుభూతి గురించి మన అవగాహన కూడా కొన్నిసార్లు మన ముందస్తు అభిప్రాయాల ప్రభావానికి లోనవుతోందా? అనే ప్రశ్నలను ఈ చిత్రం లేవనెత్తుతుంది. ఈ కథకు కొందరు అద్భుతమైన నటీనటుల ప్రదర్శనలు ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా బాబీ డియోల్ తన పాత్రలో పూర్తిగా లీనమై, ఆ పాత్రకు అవసరమైన సెన్సిటివిటీ, ఇంటెన్సిటీని తన నటనలో అద్భుతంగా ఆవిష్కరించారు. ఇప్పుడు ‘బందర్’ హిందీ జీ5 ద్వారా మరింత విస్తృతంగా ప్రేక్షకుల ముందుకు వస్తుండటం ఆనందంగా ఉంది. ప్రేక్షకులు ఈ సినిమాను చూసి, తమదైన కోణంలో అర్థం చేసుకుని, ఈ అంశంపై ఆలోచిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.
బాబీ డియోల్ మాట్లాడుతూ “‘బందర్’ మూవీ నన్ను..నా కంఫర్ట్ జోన్ నుంచి పూర్తిగా బయటకు తీసుకొచ్చిన అరుదైన ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఈ పాత్ర ఒక నటుడిగా మాత్రమే కాకుండా.. వ్యక్తిగతంగా కూడా నా నుంచి ఎంతో డిమాండ్ చేసింది. నా సంకోచాలను పక్కనపెట్టి, సినిమాపై నమ్మకం ఉంచి, అనురాగ్ విజన్‌ను పూర్తిగా నమ్మి అంకిత భావంతో చేశాను. అనురాగ్ కథను నెరేట్ చేసే విధానంలో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే.. ఆయన ఎప్పుడూ అందరూ ఊహించే దారిలో వెళ్లరు. అసౌకర్యంగా అనిపించే, ఊహించని కోణాలను అన్వేషించేలా కథలను సిద్ధం చేస్తారు. అదే ఈ ప్రయాణాన్ని నాకు ఎంతో ప్రత్యేకంగా, సంతృప్తికరంగా మార్చింది. ఈ పాత్రలో నటించడం సవాల్‌తో కూడుకున్నదే అయినప్పటికీ.. అదే సమయంలో ఎంతో స్వేచ్ఛను ఇచ్చింది. ప్రతి క్షణాన్ని నేను ఎంతో ఆస్వాదించాను. ‘బందర్’ సినిమాకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. హిందీ .జీ5లో ఈ సినిమా ప్రీమియర్ కావడం ద్వారా.. ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ విభిన్నమైన సినిమాను చూస్తారని భావిస్తున్నాను” అన్నారు.
నటి సప్నా పబ్బీ మాట్లాడుతూ “‘బందర్’ నా కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైన అనుభూతిని మిగిల్చిన చిత్రాల్లో ఒకటి. గాయత్రి పాత్ర కోసం అనురాగ్ సర్ నన్ను సంప్రదించినప్పుడు.. ఆ పాత్రలోని అనేక కోణాలు, ఊహించని మలుపులు నన్ను వెంటనే ఆకట్టుకున్నాయి. ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. గాయత్రి చాలా సంక్లిష్టమైన పాత్ర. ఆమె తీసుకునే నిర్ణయాలే కథను ముందుకు నడిపిస్తాయి. అలాంటి పాత్రను పోషించడం భావోద్వేగపరంగా సవాల్‌గా అనిపించినప్పటికీ.. అదే సమయంలో ఎంతో సంతృప్తినిచ్చింది. అనురాగ్ సర్ నాపై ఉంచిన నమ్మకం, పాత్రలోని విభిన్న కోణాలను అన్వేషించేందుకు ఆయన ఇచ్చిన స్వేచ్ఛ నాకు ఎంతో నచ్చింది. ఇప్పుడు ఈ సినిమా హిందీ జీ5 ద్వారా మరింత విస్తృతమైన ప్రేక్షకుల ముందుకు వస్తుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ విభిన్నమైన కథను మరింత మంది ప్రేక్షకులు చూసేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అన్నారు.
నటి సన్యా మల్హోత్రా మాట్లాడుతూ “‘బందర్’ ప్రేక్షకుల్లో ఆలోచనను రేకెత్తించే, పరిస్థితులను విభిన్న కోణాల్లో చూసేలా ప్రోత్సహించే సినిమా. ఆలోచింపజేసే ఎన్నో ప్రశ్నలను లేవనెత్తే ఈ కథ.. సినిమా చూసిన తర్వాత కూడా మనతో పాటు ప్రయాణిస్తూనే ఉంటుంది. ఇప్పుడు హిందీ జీ5లో ఈ సినిమా అందుబాటులోకి వస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని చూసి, ఇందులోని బలమైన అంశాలపై ఆలోచించే అవకాశం లభిస్తుంది” అన్నారు.
ఆగస్ట్ 28న హిందీ ZEE5లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రీమియర్ కానున్న ఉత్కంఠ భరితమైన ‘బందర్’ కథను ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉండండి.

