Skip to content

‘కామ్రేడ్ కళ్యాణ్’ నుంచి ‘సరస్వతమ్మ’గా రాధిక ఫస్ట్ లుక్ రిలీజ్

‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’తో అలరించబోతున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆసక్తికరమైన పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు రొమాన్స్, ఎమోషన్స్ తో రూపొందిస్తున్నారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మిస్తున్నారు. 1992లో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌తో పాటు తొలి రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ‘సరస్వతమ్మ’గా ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

‘జై బాలయ్య’ హెడ్‌బ్యాండ్ కట్టుకుని, సీరియస్ లుక్‌లో కనిపిస్తున్న రాధికా శరత్‌కుమార్ పాత్రపై ఆసక్తిని పెంచుతోంది. ఆమె బాడీ లాంగ్వేజ్ సరస్వతమ్మ పాత్రకు కథలో మంచి ప్రాధాన్యత ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా బాలయ్య అభిమానిగా పాత్రను డిజైన్ చేయడం ఆసక్తికరంగా ఉంది. సరస్వతమ్మగా రాధికా శరత్‌కుమార్ ఫస్ట్ లుక్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.

ఈ చిత్రంలో షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. చోటా కె. ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

నటీనటులు: శ్రీవిష్ణు, మహిమా నంబియార్, రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే

సాంకేతిక బృందం:
దర్శకత్వం: జానకిరామ్ మారెళ్ల
సమర్పణ: కోన వెంకట్
నిర్మాతలు: వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి
సంగీతం: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
ఎడిటర్: చోటా కె. ప్రసాద్
PRO: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.