Skip to content

సెప్టెంబర్ 3న “రోమాంచకం” వరల్డ్ వైడ్ రిలీజ్

సెప్టెంబర్ 3న “రోమాంచకం” వరల్డ్ వైడ్ రిలీజ్

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా “రోమాంచకం”. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు ఈ సినిమా సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు ఈ చిత్ర ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.

డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ మాట్లాడుతూ – “రోమాంచకం” సక్సెస్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ సినిమా డెఫనెట్ గా హిట్ అవుతుంది. ఆ సక్సెస్ మీట్ లో ఈ సినిమా గురించి మాట్లాడుతాను. అన్నారు.

నటి కీర్తన మాట్లాడుతూ – ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ వేణుగోపాల్ గారికి థ్యాంక్స్. నా స్నేహితులతో కలిసి ఈ చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నటించడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ఇలాంటి మరిన్ని మూవీస్ నాకు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రొడక్షన్ డిజైనర్ ఖుషి మాట్లాడుతూ – సినిమా మీద ప్యాషన్ ఉన్న టీమ్ ఈ చిత్రానికి వర్క్ చేసింది. ఆ టీమ్ తో కలిసి పనిచేయడం ఇన్స్ పైర్ చేసింది. కంప్లీట్ ఎఫర్ట్స్ ఈ సినిమాకు పెట్టి పనిచేశాం. మా మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

డీవోపీ పవన్ పప్పుల మాట్లాడుతూ – ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయడం హ్యాపీగా ఉంది. ఈ అవకాశం కల్పించిన మా డైరెక్టర్ వేణు గారికి, భద్రకాళీ పిక్చర్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ఇలాంటి యంగ్ టీమ్ తో పనిచేయడం కొత్త ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. అన్నారు.

నటుడు నరేంద్ర మాట్లాడుతూ – భద్రకాళీ పిక్చర్స్ లో పనిచేయడం ఒక డ్రీమ్ లాంటిది. అలాంటి కల నిజమైంది. అందుకు మా డైరెక్టర్ వేణుగోపాల్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. సుమంత్ ప్రభాస్ తో నేను చేస్తున్న రెండో చిత్రమిది. ఈ సినిమా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ వంటి అంశాలు కలిపి మీకు థియేటర్స్ లో మంచి అనుభూతిని కలిగిస్తుంది. అన్నారు.

నటుడు మణి మాట్లాడుతూ – మీరు మీ ఫ్రెండ్స్ తో వెళ్లినా, ఫ్యామిలీ మెంబర్స్ తో వెళ్లినా థియేటర్స్ లో ఎంజాయ్ చేసే చిత్రమిది. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అన్నీ బ్యాలెన్స్ గా ఉంటూ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఇలాంటి మంచి మూవీలో నేను భాగమైనందుకు సంతోషంగా ఉంది. అన్నారు.

నటుడు సోహన్ మాట్లాడుతూ – యాడ్స్ చేసే నాకు ఇలాంటి పెద్ద మూవీలో అవకాశం రావడం మర్చిపోలేను. ప్రణయ్ అన్న ఇచ్చే సపోర్ట్ కు చాలా థ్యాంక్స్. ఆయన ఈ చిత్రంతో పాటు మరో సినిమాలోనూ నన్ను హీరోగా రిఫర్ చేశారు. ఈ చిత్రానికి ఒక పిక్నిక్ వెళ్లినట్లు వర్క్ చేశాం. సెప్టెంబర్ 3న మా రోమాంచకం మూవీ రిలీజ్ అవుతోంది. ఇదొక సోల్ ఫుల్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. యూత్ కే కాదు ఫ్యామిలీ అందరికీ నచ్చేలా ఈ సినిమా చేశాం. అన్నారు.

డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ – ఈ సినిమా కథను రెండు గంటల పాటు సందీప్, ప్రణయ్ లకు చెప్పాను. వాళ్లిద్దరు కథ విన్న వెంటనే మనం ఈ సినిమా చేస్తున్నామని చెప్పారు. సందీప్ వంగా ఏ రోజూ మా పనిలో జోక్యం కలిగించుకోలేదు. ఇది నీ విజన్, నీ సినిమా, నీ లైఫ్ అని చెప్పి జస్ట్ డూ ఇట్ అనేవారు. ఫస్ట్ కట్ చూశాక సందీప్ వంగా ఒక బీర్ ఓపెన్ చేసి ఆస్కార్ అవార్డ్ లా నా చేతికి అందించారు. ఆ సందర్భం ఎంతో సంతోషాన్నిచ్చింది. సుమంత్ ప్రభాస్ నాటీ అబ్బాయి, అనంతిక ప్రెటీ అమ్మాయి. భద్రకాళీ పిక్చర్స్ మోటో ఏంటంటే మన పనే ముందు మాట్లాడాలి అనుకుంటాం. పవన్ బ్యూటిఫుల్ విజువల్స్, వాసుకి వైభవ్ ఇచ్చిన మంచి మ్యూజిక్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. సెప్టెంబర్ 3న మా రోమాంచకం మూవీని థియేటర్స్ లో చూడండి. అన్నారు.

హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ మాట్లాడుతూ – మా రోమాంచకం సినిమా సెప్టెంబర్ 3న రిలీజ్ అవుతోంది. వేణు, సందీప్, ప్రణయ్ గారితో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మేమంతా ఎంజాయ్ చేస్తూ, కంఫర్ట్ గా సినిమా షూటింగ్ చేశాం. ఈ టీమ్ తో వర్క్ చేయడం బ్యూటిఫుల్ గా అనిపించింది. 8 వసంతాలు సినిమా తర్వాత అనేక స్క్రిప్ట్స్ విన్నాను. కానీ వేణుగోపాల్ గారు చెప్పిన ఈ కథకు కనెక్ట్ అయ్యాను. ఇదొక బ్యూటిఫుల్ స్క్రిప్ట్. నేను వివిధ తరహా చిత్రాల్లో నటించాలని అనుకుంటున్నా. అలా నేను కోరుకున్న జానర్స్ లో రోమాంచకం కూడా ఉంది. ఇది నా టైప్ మూవీ అని చెప్పొచ్చు. అన్నారు.

ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ – డైరెక్టర్ వేణుగోపాల్ పదిహేను నెలల క్రితం ఈ కథ చెప్పారు. స్క్రిప్ట్ మొత్తం హిలేరియస్ గా నెరేట్ చేశారు. అన్ని క్యారెక్టర్స్ ను తనే పర్ ఫార్మ్ చేసి చూపించారు. స్క్రిప్ట్ మమ్మల్ని ఇంప్రెస్ చేసింది. ఈ సినిమా చేద్దామని ముందుకొచ్చాం. డైరెక్టర్ వేణుగోపాల్ మూడు నెలలు ఆర్టిస్టులతో రిహార్సల్స్ చేయించి మంచి పర్ ఫార్మెన్స్ వారి దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ పర్ ఫార్మెన్స్ లను మీరు కొత్తగా ఫ్రెష్ గా ఫీలవుతారని నమ్ముతున్నాం. పేపర్ మీద ఏ బడ్జెట్ అనుకున్నామో ఆ బడ్జెట్ లోనే సినిమా చేశాడు. చిన్న సినిమా అనే ఫీల్ మీకు ఎక్కడా రాదు. నేను నమ్మిన కథ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. బడ్డీ కామెడీ మూవీ ఇది. చాలా సరదాగా సాగుతుంటుంది. ప్రతి టీమ్ మెంబర్ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి పనిచేశారు. ఆ ఔట్ పుట్ మీకు కనిపిస్తుంటుంది. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి చూడండి, సినిమా చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. సినిమా చూస్తూ సందీప్ బాగా ఎంజాయ్ చేశారు. మా మూవీని ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో రిలీజ్ చేస్తున్న సునీల్ నారంగ్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా మంచి విజయం సాధించి ఈ యంగ్ టీమ్ అందరికీ ఫేమ్ తీసుకురావాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ – భద్రకాళీ పిక్చర్స్ అంటే అందరికీ డ్రీమ్ బ్యానర్. ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక అనౌన్స్ చేశారు. అప్పటికే నన్ను చాలా మంది ఈ సినిమా గురించి అడుగుతుండేవారు. చెబితే మా ఇంట్లోవాళ్లు కూడా నమ్మేవారు కాదు. ఈ సినిమా అవకాశం వచ్చాక సూపర్ హ్యాపీగా ఫీలయ్యా. డైరెక్టర్ వేణుగోపాల్ నాతో ఆరు నెలలు రిహార్సల్స్ చేయించారు. సందీప్ అన్న దుబాయ్ లో సైమా అవార్డ్స్ లో కలిసినప్పుడు ఈ కథ గురించి చెప్పారు. ఖతర్నాక్ కథ ఉంది వింటావా అన్నారు. ఆ ఎగ్జైట్ మెంట్ లో నెక్ట్స్ డే ఇండియా వచ్చాను. భద్రకాళీ పిక్చర్స్ ఆఫీస్ కు వెళ్లినప్పుడు ఒక ఇంటెన్స్ కథ ఉంటుందని ఊహించా. వేణుగోపాల్ అన్న రెండున్నర గంటలు కథ చెప్పారు. ఆ రెండున్నర గంటలు నాన్ స్టాప్ గా నవ్వుకున్నా. పేపర్ మీద ఏముందో అదే తెరకెక్కించాడు. కొత్తగా న టించాననే ఫీల్ నాకే కలిగింది. అనంతిక ఎక్స్ట్రార్డినరీగా పర్ ఫార్మ్ చేసింది. ఈ చిత్రంలోని ప్రతి క్యారెక్టర్ ను మీరు గుర్తుపెట్టుకుంటారు. రోమాంచకం టైటిల్ లోనే కొత్తదనం ఉంది. మీరంతా సెప్టెంబర్ 3న ఒక సూపర్ ఎంటర్ టైనర్ ను ఎక్సిపీరియన్స్ చేయబోతున్నారు. అన్నారు.

నటీనటులు – సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్, ఉపేంద్ర లిమయె, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి, సోహన్, తదితరులు

టెక్నికల్ టీమ్
—————————–
డీవోపీ – పవన్ పప్పుల
మ్యూజిక్ – వాసుకి వైభవ్
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను
పీఆర్ఓ – సురేష్ ( ఎస్. కె. మీడియా )
మార్కెటింగ్- వాల్స్ అండ్ ట్రెండ్స్
బ్యానర్ – భద్రకాళీ పిక్చర్స్
ప్రెజెంటర్ – సందీప్ రెడ్డి వంగా
ప్రొడ్యూసర్ – ప్రణయ్ రెడ్డి వంగా
రచన, దర్శకత్వం – వేణుగోపాల్ రెడ్డి

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.