Skip to content

‘మిరాయ్’ హిందీ రైట్స్ సొంతం చేసుకున్న కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్

హనుమాన్ సంచలన విజయంతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న సూపర్ హీరో తేజ సజ్జా, ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మిరాయ్‌’లో సూపర్ యోధగా అలరించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న మిరాయ్ ఈ సంవత్సరం బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్‌లలో ఒకటిగా మారనుంది.

ఉత్సాహాన్ని మరింత పెంచుతూ బాలీవుడ్ లీడింగ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ‘మిరాయ్’ లోకి వచ్చారు. తన ప్రతిష్టాత్మక బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్, మిరాయ్ హిందీ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకుంది. మిరాయ్ నార్త్ లో మ్యాసివ్ గా రిలీజ్ కానుంది. బాహుబలి, దేవర వంటి తెలుగు బ్లాక్‌బస్టర్‌లతో ధర్మ ప్రొడక్షన్స్ కు సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ వుంది. ఈ కొలాబరేషన్ మిరాయ్ పై మరింత ఎక్సయిట్మెంట్ పెంచింది.

ఈ చిత్రం గ్లింప్స్, టీజర్‌కు నేషనల్ వైడ్ గా అద్భుతమైన స్పందన వచ్చింది. మొదటి సింగిల్ వైబ్ ఉంది చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.

తేజ సజ్జ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తోంది. మిరాయ్‌లో మనోజ్ మంచు విలన్‌గా, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ దర్శకత్వం వహించడమే కాకుండా, సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే స్క్రీన్‌ప్లేను కార్తీక్ స్వయంగా రూపొందించారు. మణిబాబు కరణం రచన, సంభాషణలకు కీలకంగా పని చేశారు. గౌర హరి సంగీతం, ఆర్ట్ డైరెక్టర్‌గా శ్రీ నాగేంద్ర తంగాల, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సుజిత్ కుమార్ కొల్లి పని చేస్తున్నారు.

మిరాయ్ 2D , 3D ఫార్మాట్‌లలో ఎనిమిది భాషల్లో సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇది ట్రూ పాన్-ఇండియన్ విజువల్ వండర్ గా ఉండబోతుంది.

తారాగణం: సూపర్ హీరో తేజ సజ్జ, మనోజ్ మంచు, రితికా నాయక్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి
సంగీతం: గౌర హరి
ఆర్ట్ డైరెక్టర్: శ్రీ నాగేంద్ర తంగాల
రైటర్: మణిబాబు కరణం
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా