Skip to content

రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” సినిమా నుంచి బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” చిత్రంలో నటిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ బర్త్ డే విశెస్ తో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో దేవుడిని ప్రార్థిస్తున్న నిధి అగర్వాల్ స్టిల్ ఆకట్టుకుంటోంది. కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన “రాజా సాబ్” టీజర్ లో నిధి అగర్వాల్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసింది. ఈ మూవీలో నిధి అగర్వాల్ అందంతో పాటు నటనకు అవకాశమున్న ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించనుంది.

“రాజా సాబ్” మూవీ తన కెరీర్ కు ఎంతో ప్రత్యేకంగా భావిస్తోంది నిధి అగర్వాల్. ఈ సినిమాతో తాను మరింతగా ప్రేక్షకుల అభిమానం సంపాదించుకుంటానని ఆశిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “రాజా సాబ్” సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

నటీనటులు – ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్, తదితరులు

టెక్నికల్ టీమ్

ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ – కార్తీక్ పళని
మ్యూజిక్ – తమన్
ఫైట్ మాస్టర్ – రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ కేఎన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – టీజీ కృతి ప్రసాద్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్- శ్రీనివాస్), వంశీ కాకా
కో ప్రొడ్యూసర్ – వివేక్ కూచిభొట్ల
ప్రొడ్యూసర్ – టీజీ విశ్వప్రసాద్
రచన, దర్శకత్వం – మారుతి