▪️నాటు నాటు రుచులతో గచ్చిబౌలిలో 'ఎల్లిపాయకారం రెస్టారెంట్' ▪️*పాల్గొన్న పలు సినీ, రాజకీయ ప్రముఖులు* హైదరాబాద్:…
విజయవాడలో యాక్సిస్ బ్యాంక్ ‘ఈవాల్వ్’ 10 ఏళ్ల పూర్తి – ఎంఎస్ఎంఈలకు వినూత్న పరిష్కారాలు, సుస్థిర భవిష్యత్తు దిశగా మార్గం
‘‘ఈవాల్వ్’, యాక్సిస్ బ్యాంక్ ఎంఎస్ఎంఈల కోసం రూపొందించిన ప్రతిష్టాత్మక జ్ఞాన భాగస్వామ్య వేదిక, వ్యాపారవేత్తలకు తమ వ్యాపారాలను విస్తరించడానికి అవసరమైన జ్ఞానం, నెట్వర్కులు, వృద్ధి సాధనాలను అందిస్తుంది.
ఈ లక్ష్యం ఆంధ్రప్రదేశ్‌లో మరింత బలంగా ప్రతిధ్వనిస్తోంది. రాష్ట్రంలో 33.5 లక్షలకుపైగా ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉండి, అవి 27 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ దేశ జిడిపి (GDP) లో 4.9% వాటా కలిగి ఉంది. రాష్ట్ర స్థాయి ఆర్థిక వ్యవస్థల్లో 9వ స్థానంలో నిలిచి, H1FY25లో ₹1.27 లక్షల కోట్ల ఎగుమతులు సాధించింది.
విజయవాడ, సెప్టెంబర్ 22, 2025: భారతదేశంలో అగ్రగామి ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన యాక్సిస్ బ్యాంక్, తన బహుశహరాల జ్ఞాన శ్రేణి ‘ఈవాల్వ్’ 10వ ఎడిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో నిర్వహించింది. “ఎంఎస్ఎంఈలు – $10 ట్రిలియన్ ఎకానమీకి ఇంధనం” అనే అంశంపై నిర్వహించిన ఈ కార్యక్రమం వ్యాపారవేత్తలు, పరిశ్రమ నాయకులు, పాలసీ నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, భారత ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొంటున్న అవకాశాలు, సవాళ్లపై చర్చకు వేదికగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో 150కుపైగా ఎంఎస్ఎంఈ ప్రమోటర్లు, మేనేజింగ్ డైరెక్టర్లు పాల్గొన్న ఈ కార్యక్రమం, ఆలోచనలు మరియు అనుభవాల మార్పిడి కోసం ఉత్తేజకరమైన వేదికగా నిలిచింది. రతుల్ ముఖోపధ్యాయ్, EVP – SEG Asset, Commercial Banking Group, యాక్సిస్ బ్యాంక్, సునీల్ పాచ్లాంగియా, SVP – Treasury Forex, యాక్సిస్ బ్యాంక్, నూటి చక్రవర్తి, EVP & Regional Branch Banking Head – South 2, యాక్సిస్ బ్యాంక్ ఆర్థిక ధోరణులు మరియు విజయవాడ ఎంఎస్ఎంఈ రంగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వృద్ధి మరియు ఉపాధి సృష్టిలో పోషిస్తున్న కీలక పాత్రపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ప్రియవరత్ శర్మ, SVP & Business Head – SBB: Working Capital, యాక్సిస్ బ్యాంక్ సమన్వయం చేసిన ప్యానెల్ చర్చలో మోడెర్టెడ్, ఫణి కుమార్ సమినేని, Executive Director – శ్రీ అనంత లక్ష్మీ స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ & పార్ట్నర్ – శ్రీ అనంత లక్ష్మీ టెక్స్టైల్స్, నరేంద్రనాథ్ చెబ్రోలు, Founder – అలయన్స్ వన్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ & డెల్టా టెక్నాలజీ & మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, & సుజిత్ యలమంచిలి, కార్యదర్శి – చలపతి ఎడ్యుకేషనల్ సొసైటీ పాల్గొని భారత ఎంఎస్ఎంఈల పట్టుదల, అభివృద్ధి దిశలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈవాల్వ్ ద్వారా యాక్సిస్ బ్యాంక్ ఎంఎస్ఎంఈలకు ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచడం, సాంకేతికతను ఆమోదించడం, మార్కెట్ విస్తరణలో మార్గదర్శకతను అందిస్తోంది. ఈ కార్యక్రమం సంప్రదాయ బ్యాంకింగ్‌ను మించి వ్యాపారవేత్తలకు సుస్థిర వృద్ధి కోసం సాధనాలు అందిస్తోంది.
ఈ సందర్భంగా విజయ్ శెట్టి, ప్రెసిడెంట్ & హెడ్ – కమర్షియల్ బ్యాంకింగ్ కవరేజ్ గ్రూప్ (CBG), యాక్సిస్ బ్యాంక్ మాట్లాడుతూ “భారత ఆర్థిక రూపాంతరానికి ఎంఎస్ఎంఈలు వెన్నెముకవంటివి. 33 లక్షలకుపైగా ఎంఎస్ఎంఈ యూనిట్లు, దృఢమైన మౌలిక సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్ ఈ వేగాన్ని ముందుకు నడిపించడానికి ప్రత్యేకంగా సిద్ధమైంది. ఈవాల్వ్ వంటి కార్యక్రమాల ద్వారా వ్యాపారవేత్తలకు సరైన ఆర్థిక పరిష్కారాలు, జ్ఞానం, నెట్‌వర్క్‌లను అందించి భారతదేశం $10 ట్రిలియన్ ఎకానమీగా మారే ప్రయాణంలో భాగస్వామ్యం అవ్వాలని మా లక్ష్యం” అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిడిపి ₹16.6 లక్షల కోట్లు, దేశ ఎగుమతుల్లో 5% వాటా సాధించింది. రాష్ట్రంలోని 9% ఎంఎస్ఎంఈలు 27 లక్షలకుపైగా ఉద్యోగాలు సృష్టించాయి, అందులో మహిళా యజమానుల వాటా గణనీయంగా ఉంది. పోర్టులు, ఆర్థిక కారిడార్లు, మౌలిక వసతులు, ప్రభుత్వ విధానాలు రాష్ట్రాన్ని కొత్త పరిశ్రమల పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెడుతున్నాయి.
దక్షిణ భారత (Gateway to South India)గా పేరుగాంచిన విజయవాడ, రహదారులు (NH16, NH65), ప్రధాన రైల్వే జంక్షన్, MSME పార్కుల అభివృద్ధి వంటి అంశాలతో ఈవాల్వ్ నిర్వహణకు సరైన వేదికగా నిలిచింది.
గత 10 ఏళ్లలో, ఈవాల్వ్ 50+ నగరాల్లో 10,000కుపైగా వ్యాపారవేత్తలను కలిపింది, వారికి సాంకేతిక పరిజ్ఞానం, ఆపరేషనల్ సామర్థ్యం, సుస్థిర వ్యాపార వృద్ధికి వ్యూహాలను అందించింది.

