మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో బుధవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం…
శ్రీ చైతన్య పాఠశాలలో రైజింగ్ ఇండియా

మెహిదీపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో రైజింగ్ ఇండియా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ చైతన్య స్కూల్స్ మెహిదీపట్నం జోన్ ఏజీఎం కృష్ణ, మెహిదీపట్నం బ్రాంచి ప్రిన్సిపల్ ఎన్.స్వాతి మాట్లాడుతూ–‘‘పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు భారతదేశం గురించి, గొప్పతనం గురించి తెలుసుకోవాలి. మనదేశం రైజింగ్ ఇండియాగా మారడానికి ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలి’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాల డీన్ మల్లేశ్, కో ఆర్డినేటర్ జనార్ధన్, ప్రైమరీ ఇన్‌చార్జ్ పల్లవి, సి–బ్యాచ్ ఇన్‌చార్జ్ ఆంజనేయులు, ఐపీఎల్ ఇన్‌చార్జ్ బాలరాజు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
