Skip to content

రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి “స్టూడెంట్” మూవీ టీజర్ రిలీజ్

స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “స్టూడెంట్”. ఈ సినిమాలో విజేత పరీక్ హీరోయిన్ గా నటిస్తోంది. జోవికా సినిమాస్, చెరిష్ మీడియా వర్క్స్ బ్యానర్స్ పై బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. బాలు తత్వమసి దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లం సంగీత, బెల్లం బయ్యారెడ్డి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. “స్టూడెంట్” సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

“స్టూడెంట్” సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే – సరదాగా కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసే స్టూడెంట్ భాను (మేఘాంశ్ శ్రీహరి) ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ తరుపున పాలిటిక్స్ లోకి రావడం కాలేజ్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. పాలిటిక్స్ కు కొత్తైనా రాజకీయాల్లో ఉండే ప్రమాదాలను, ఎత్తులు పై ఎత్తులను త్వరగా అర్థం చేసుకుంటాడు భాను. ‘పక్కనోడు కత్తితో యుద్ధం చేస్తున్నప్పుడు మనం చెయ్యి పెడితే తెగిపోద్ది, మనం పాలిటిక్స్ లో ఉన్నాం, ఇక్కడ ఎథిక్స్ ఉండవు, ఓన్లీ ట్రిక్సే ఉంటాయి.’ అంటూ మేఘాంశ్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ టీజర్ కు హైలైట్ గా నిలుస్తోంది. స్టూడెంట్ రాజకీయాల్లోకి వస్తే ఈ పొలిటికల్ ఆటను ఎలా మార్చేయగలడు అనేది ఇంపాక్ట్ ఫుల్ గా చూపించారు. భాను లైఫ్ లో తన్మయితో ఉన్న ప్రేమకథ ఏంటి?, రాజకీయాల్లోకి వచ్చి భాను తను అనుకున్నది సాధించగలిగాడా లేదా?, భుజంగం, కేతిరెడ్డి మధ్య గొడవలేంటి? అనే అంశాలతో టీజర్ ఆసక్తిని కలిగించింది. లీడర్ లక్షణాలు ఉన్న డేరింగ్ స్టూడెంట్ గా, యంగ్ పొలిటీషియన్ గా మేఘాంశ్ ఇంటెన్స్ పర్ ఫార్మెన్స్ కనబర్చారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్ట్రాంగ్ విజువల్స్, క్రియేటివ్ షార్ట్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులు, బీజీఎం హై క్వాలిటీతో ఉన్నాయి.

నటీనటులు – మేఘాంశ్ శ్రీహరి, విజేత పరీక్, శుభలేఖ సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్, తదితరులు

టెక్నికల్ టీమ్
—————–
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – దీపక్ భూపతి
ప్రొడక్షన్ మేనేజర్ – కేఎల్ మదన్
కొరియోగ్రఫీ – ఈశ్వర్ పెంటి, రామ్ ఇసుకపాటి
అడిషనల్ స్క్రీన్ ప్లే – నగేష్ గుండపనేని
కాస్ట్యూమ్ డిజైనర్ – మైథిలీ సీత
ఆర్ట్ డైరెక్టర్ – రాజు చిరుపెల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఉదయ్ పెండ్యాల
స్టంట్స్ – రియల్ సతీష్
ఎడిటర్ – నరేష్ అడుపా, హరిశంకర్ టీఎన్
డీవోపీ – శ్రీనివాస్ బెజుగం
మ్యూజిక్ – ప్రేమ్ చంద్ కంచర్ల
కో ప్రొడ్యూసర్స్ – బెల్లం సంగీత, బెల్లం బయ్యారెడ్డి
ప్రొడ్యూసర్ – బెల్లం సిద్ధారెడ్డి
స్క్రిప్ట్, డైరెక్షన్ – బాలు తత్వమసి
మార్కెటింగ్ – హౌస్ ఫుల్ డిజిటల్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.