Skip to content

‘రావు బహదూర్’ సినిమా జూన్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్

  • MOVIES
  • Vishwanath
‘రావు బహదూర్’ సినిమా జూన్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్ Telugu News

సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’ చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.

‘రావు బహదూర్’ జూన్ 5న థియేటర్లలోకి రానుందని అఫీషియల్ గా ప్రకటించారు. అకడమిక్ సీజన్ ప్రారంభానికి ముందు ఈ రిలీజ్ ప్లాన్ చేయడం మంచి స్ట్రాటజిక్‌గా కనిపిస్తోంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో సత్యదేవ్ రాయల్ అవతార్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు.

సాంప్రదాయ దుస్తుల్లో, అధికారం, రహస్యభావం కలిసిన లుక్‌తో ఆయన ప్రెజెన్స్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆయన పాగాలో కనిపించే చిన్న పురుగు ఒక సింబాలిక్ అంశంగా కనిపిస్తూ కథలోని లోతైన అర్థాలను సూచిస్తోంది. తీగలతో కప్పబడ్డ భారీ కోట బ్యాక్‌డ్రాప్ సినిమా మరింత క్యురియాసిటీని పెంచింది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన రాగా, ఫస్ట్ సింగిల్ ‘ఓ సుందరి’ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. సత్యదేవ్, దీప థామస్‌లపై చిత్రీకరించిన ఈ మెలోడీ ఒక వింటేజ్ ప్రేమను అందంగా ప్రతిబింబిస్తూ, పీరియడ్ ఫీల్‌ను అద్భుతంగా చూపించింది.

కథ, దర్శకత్వం, ఎడిటింగ్ అన్నీ బాధ్యతలను స్వయంగా తీసుకున్న వెంకటేష్ మహా తనదైన సెన్సిబిలిటీస్‌తో పాటు యూనివర్సల్ ఎమోషన్స్‌ను కలిపిన కథను అద్భుతంగా తెరకెక్కించారు.

టెక్నికల్‌గా కూడా ఈ చిత్రం బలంగా ఉంది. కార్తిక్ పరమార్ సినిమాటోగ్రఫీని అందించగా, స్మరణ్ సాయి సంగీతాన్ని సమకూర్చారు. రోహన్ సింగ్ ప్రొడక్షన్ డిజైనర్.

రాయల్ విజువల్స్, మిస్టీరియస్ టోన్‌తో ‘రావు బహదూర్’ ప్రతి డీటేయిల్ లోతైన అర్థం దాగి ఉన్న ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లే చిత్రంగా రూపుదిద్దుకుంటోంది.

తారాగణం: సత్య దేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం, ఎడిటర్: వెంకటేష్ మహా
సమర్పణ: మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ GMB ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు: చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి & శరత్ చంద్ర
ప్రొడక్షన్ బ్యానర్స్: A+S మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ యాదవ్ బి
DoP: కార్తీక్ పర్మార్
సంగీతం: స్మరణ్ సాయి
ప్రొడక్షన్ డిజైనర్: రోహన్ సింగ్
PRO: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైన్స్: ఎల్లో టూత్స్

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.