మహేష్ బాబు గారు ‘రావు బహదూర్’ చూసి ‘మునుపెన్నడూ చూడని సినిమా’ అని చెప్పడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది: హీరో సత్యదేవ్
సూపర్ స్టార్ మహేష్ బాబు పవర్ ఫుల్ వాయిస్ తో సత్యదేవ్, వెంకటేష్ మహా, ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, ఎంబీ ఎంటర్టైన్మెంట్ మోస్ట్ అవైటెడ్ సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్' మోర్ దాన్ ఏ టీజర్" రిలీజ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకటేష్ మహా కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్'. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, వినూత్న ప్రచార కార్యక్రమాలు, పలువురు ప్రముఖుల ప్రశంసలతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై, ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల…
