Skip to content

‘రావు బహదూర్’ సినిమా చూసిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశసంలు

సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’ను, సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ తమ ‘GMB ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్‌పై, A+S మూవీస్ , శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి సమర్పిస్తున్నారు. వెంకటేష్ మహా రచన, ఎడిటింగ్, దర్శకత్వం వహించిన ఈ సినిమా గ్లింప్స్, టీజర్, పాటలు ఇప్పటికే సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేశాయి

ఈ కథను మొదటిసారి విన్నప్పటి నుండే మహేష్ బాబు ‘రావు బహదూర్’ పట్ల ఎంతో ఆసక్తిని, ఎమోషనల్ ఎటాచ్మెంట్ ని పెంచుకున్నారు. కేవలం సమర్పకుడిగానే కాకుండా, సినిమా ఆలోచన దశ నుండి పూర్తయ్యే వరకు దాని క్రియేటివ్ ప్రయాణాన్ని ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. సినిమా ఫైనల్ కట్ చూసిన తర్వాత ఆయన ఎంతో మెస్మరైజ్ అయ్యారు.

సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకుంటూ, మహేష్ బాబు ఈ సినిమాను, రూపొందించిన విధానాన్ని ప్రశంసించారు. అలాగే, ‘రావు బహదూర్’ ప్రేక్షకులకు నిజంగా మెమరబుల్ సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందనే తన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, ఫైనల్ అవుట్‌పుట్ పట్ల పూర్తి నమ్మకాన్ని తెలియజేశారు.

‘X’ (ట్విట్టర్)లో మహేష్ బాబు ఒక స్పెషల్ పోస్ట్ పెట్టారు “రావు బహదూర్… ఇది కేవలం ప్రేక్షకులను కట్టిపడేసే సినిమా మాత్రమే కాదు, వారి మనసులో లోతుగా ముద్ర వేసుకునే చిత్రం!!! విభిన్నంగా, అందంగా, ఇంటెన్స్ డ్రామాతో కూడిన సినిమా ఇది. దర్శకుడు వెంకటేష్ మహా ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు… ఆ ప్రపంచాన్ని సత్యదేవ్ తనదైన శైలిలో అద్భుతంగా ఆవిష్కరించారు!!! దీపా థామస్ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు… నటీనటులు, అద్భుతమైన సాంకేతిక బృందం ఈ సినిమాకు గొప్ప మద్దతునిచ్చారు!!! మొత్తం టీం పట్ల ఎంతో గర్వంగా ఉంది… జూలై 3 నుండి బిగ్ స్క్రీన్ పై’రావు బహదూర్’ను అతని మ్యాడ్ నెస్ ను మీరందరూ ఎక్స్ పీరియన్స్ చేయాలని ఆతృతగా ఎదురుచూస్తున్నాను!”

వచ్చే వారం జూలై 3న విడుదల కానున్న ఈ చిత్రానికి మహేష్ బాబు మాటలు మరింత ఉత్సాహాన్ని, బలాన్ని చేకూరుస్తున్నాయి.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.