Skip to content

‘దేత్తడి’ సెకండ్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం

‘దేత్తడి’ సెకండ్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం Telugu News
‘దేత్తడి’ సెకండ్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం Telugu News

రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన యంగ్ ట్యాలెంటెడ్ ఆశిష్ హీరోగా, సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం ‘దేత్తడి’. ఈ ప్రాజెక్ట్‌ తో దర్శకుడిగా ఆదిత్య రావు గంగసాని పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త స్టోరీని ప్రజెంట్ చేస్తున్నారు.

ఇప్పటిటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ సెకండ్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించారు. ఆశిష్ తో పాటు కీలక నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.

“’దేత్తడి” సినిమాలో హై ఎమోషన్‌తో పాటు కొత్తగా చూపించే కల్చరర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ ఉండబోతోంది.

ఆశిష్ పూర్తిగా మాస్ లుక్‌లో కనిపించడమే కాకుండా, ఒరిజినల్ హైదరాబాద్ స్లాంగ్‌లో డైలాగ్స్ చెప్పబోతున్నారు.

ఈ సినిమాకు మ్యూజిక్ జునైద్ కుమార్ అందిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో పాటు క్రియేటివ్ హెడ్‌గా కూడా పని చేస్తున్నారు.

తారాగణం: ఆశిష్

సాంకేతిక సిబ్బంది:
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్
కథ, దర్శకత్వం: అదితిరావు గంగసాని
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, క్రియేటివ్ హెడ్: ప్రసన్న కుమార్ బెజవాడ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి పున్నా (బిట్టు)
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.