- ఆగస్ట్ 8న తమిళంలో స్ట్రీమింగ్.. 27 నుంచి తెలుగు, కన్నడల్లో స్ట్రీమింగ్ భారతదేశంలోని అతిపెద్ద…
ఘనంగా సీనియర్ సిటిజన్స్ డే సెలబ్రేషన్స్


ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో సీనియర్ సిటిజన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అయిన సభ్యులను శాలువాతో సత్కరించారు, వారికి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు, ఎఫ్ఎన్ సీసీ సెక్రటరీ తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రెటరీ శివారెడ్డి, కమిటీ మెంబెర్స్ కాజా సూర్యనారాయణ, ఏడిద రాజా, వేణురాజు, కోగంటి భవాని, ఎఫ్ఎన్ సీసీ మాజీ అధ్యక్షులు ఆది శేషగిరి రావు మరియు తదితర సీనియర్స్ మెంబర్స్, ఎఫ్ఎన్ సీసీ మీడియా కమిటీ చైర్మన్ భగీరథ, ఎఫ్ఎన్ సీసీ కల్చరల్ కమిటీ ఛైర్మన్ సురేష్ కొండేటి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి సీనియర్ సిటిజన్స్ డే సెలబ్రేట్ చేశారు.
ఈ సందర్భంగా ఎఫ్ ఎన్ సీసీ ప్రెసిడెంట్, కేఎస్ రామారావు మాట్లాడుతూ – పెద్దల్ని గౌరవించుకోవడం, పిల్లల్ని ప్రేమించడం మన ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో సంప్రదాయంగా పాటిస్తున్నాం. ఈ రోజు సీనియర్ సిటిజన్స్ డే ను మన ఎఫ్ఎన్ సీసీలో ఘనంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది. మన క్లబ్ లో 90 ఏళ్లు పై బడిన వారు దాదాపు 12 మంది ఉన్నారు, 80 ఏళ్లు దాటిన వారు పాతిక మంది దాకా ఉన్నారు. మొత్తంగా సీనియర్ సిటిజన్స్ 1140 మంది ఉండటం విశేషం. వీరందరికీ ఆహ్వానాలు పంపించాం. మెంబర్ కాజా సూర్యనారాయణ, సెక్రటరీ రంగారావు గారు, ఆదిశేషగిరి రావు గారు మా అందరిలో సీనియర్స్. వీళ్లను గౌరవించుకోవడం మా బాధ్యతగా భావిస్తున్నాం” అన్నారు. ఈ సందర్భంగా పలు హిందీ, తెలుగు సాంగ్స్ తో మ్యూజిక్ ప్రోగ్రాం అందర్నీ ఆపెట్టుకున్నాయి.