‘ప్రేమనే ఊరిలో’ చిత్రం నుంచి ‘అమ్మ ప్రేమ పంచు నాన్నే’ పాట విడుదల
మహారత్న ప్రొడక్షన్స్, ఎస్కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్గా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయగా అందరిలోనూ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ‘అమ్మ ప్రేమ పంచు నాన్నే’ అంటూ సాగే అందమైన పాటను రిలీజ్ చేశారు. రాంబాబు గోసాల రాసిన సాహిత్యం, సునాద్ గౌతమ్ అందించిన బాణీ ప్రధాన ఆకర్షణ కానుంది. రామ్ మిర్యాల గాత్రం మేజర్ అస్సెట్‌గా నిలిచింది…
