Skip to content

‘ప్రేమనే ఊరిలో’ చిత్రం నుంచి ‘అమ్మ ప్రేమ పంచు నాన్నే’ పాట విడుదల

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్‌గా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయగా అందరిలోనూ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ‘అమ్మ ప్రేమ పంచు నాన్నే’ అంటూ సాగే అందమైన పాటను రిలీజ్ చేశారు.

రాంబాబు గోసాల రాసిన సాహిత్యం, సునాద్ గౌతమ్ అందించిన బాణీ ప్రధాన ఆకర్షణ కానుంది. రామ్ మిర్యాల గాత్రం మేజర్ అస్సెట్‌గా నిలిచింది. తండ్రి ప్రేమను చాటేలా సాగే ఈ పాట అందరినీ ఎమోషనల్‌గా టచ్ చేసేలా ఉంది. ఈ లిరికల్ వీడియోలో చూపించిన ఎమోషనల్ సీన్స్, గ్రామీణ వాతావరం అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

KGF, కాంతారా వంటి చిత్రాలకు డైలాగ్స్ అందించిన హనుమాన్ చౌదరి ఈ చిత్రానికి సంభాషణలు రాశారు. ప్రముఖ గేయ రచయిత రాంబాబు గోసాల పాటలను రచించారు. సునద్ గౌతమ్ సంగీతం అందిస్తుండగా, రాజ్‌కాంత్ ఎస్.కె సినిమాటోగ్రఫీ, హర్షిత్ ప్రభు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కథ, ప్రేమ, భావోద్వేగాలు, బలమైన పాత్రలు, అందమైన పల్లె నేపథ్యంతో పాటు సురేష్ కొండేటి కంటెంట్ సెలక్షన్‌కు ఉన్న ప్రత్యేక గుర్తింపు తో ‘ప్రేమనే ఊరిలో’ మరో మంచి చిత్రంగా నిలుస్తుందనే అంచనాలు నెలకొన్నాయి.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.