Skip to content

” ప్రేమనే ఊరిలో ” మన ఊరి సినిమా. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా – సాయికుమార్

మనోజ్ కుమార్ దర్శకత్వంలో మహారత్న ప్రొడక్షన్స్, ఎస్.కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘ప్రేమనే ఊరిలో’. ఈ చిత్రంలో శ్రీరామ్, రామికా శివు, తపస్విని పూనాచా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో సూపర్ హిట్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో ‘ప్రేమనే ఊరిలో’ సినిమా గ్రాండ్ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ అతిథిగా పాల్గొన్నారు.

డైలాగ్ కింగ్ సాయికుమార్ మాట్లాడుతూ.. “ప్రేమనే ఊరిలో” ఆల్రెడీ ప్రూవ్డ్ ఫిలిం. ఇప్పటికే మంచి విజయం సాధించింది. ఇది ప్రతి ఒక్కరూ ప్రేమించే సినిమా, ఎక్స్‌పీరియన్స్ చేసే సినిమా. మన సినిమా. మన మట్టి సినిమా. మన ఊరి సినిమా. నేను త్వరలోనే ఈ సినిమాను థియేటర్స్‌లో మీతో పాటే కలిసి చూస్తాను. ఈ సినిమాను మీరంతా తప్పకుండా ఆదరిస్తారని తెలుసు. ఈ చిత్రంలో ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఉన్నాయి. ఒక చెట్టు గురించి కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. ఆర్టిస్టులంతా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్‌లు ఇచ్చారు. కథలో మంచి ఎమోషన్ ఉంది. రైతు గొప్పదనం గురించి చెప్పారు. ఒక్కటని కాదు.. మనల్ని ఆకట్టుకునే ఎన్నో అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా మనందరినీ కదిలిస్తుంది. మన ప్రేక్షకులంతా థియేటర్స్‌కు వచ్చి చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. ఈ సినిమాను మీరంతా పెద్ద బ్లాక్‌బస్టర్ చేయాలి” అన్నారు.

హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. “మా ‘ప్రేమనే ఊరిలో’ సినిమాకు సాయికుమార్ గారు లాంటి పెద్దల ఆశీర్వాదాలు దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఆయన మా గురించి చెప్పిన ప్రతి మాటను మనసులో చిరకాలం దాచుకుంటాం. సాయికుమార్ గారి లాంటి గొప్ప ఆర్టిస్టుల స్ఫూర్తి మాపై ఎప్పటికీ ఉంటుంది. మా సినిమాను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ పెద్ద థ్యాంక్స్ చెబుతున్నా. ఇంకా చూడని వారు తప్పకుండా థియేటర్స్‌లో చూడండి. ఒక మంచి సినిమా చూసిన ఫీల్ పొందుతారు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చేలా మా సినిమా ఉంటుంది” అన్నారు.

హీరోయిన్ తపస్విని పూనాచా మాట్లాడుతూ.. “మా ‘ప్రేమనే ఊరిలో’ సినిమాకు తెలుగు ఆడియెన్స్ ఇస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. మేము థియేటర్ విజిట్స్ చేశాం. ప్రతి థియేటర్‌లో ఆడియెన్స్ సూపర్బ్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలో మా అందరి క్యారెక్టర్స్ గురించి చెబుతున్నారు. అలాంటి వాళ్లు మా లైఫ్‌లోనూ ఉంటే బాగుంటుందని అంటున్నారు. వాళ్ల అప్రిషియేషన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. కర్ణాటకలో మంచి విజయం సాధించిన మా సినిమా తెలుగులో అలాంటి సక్సెస్ అందుకుంటుందని ఆశిస్తున్నాం” అన్నారు.

ప్రొడ్యూసర్ మమత దేవేంద్ర మాట్లాడుతూ.. “మా సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు మా బాబాయ్ ద్వారా సురేష్ గారిని కలిశాం. ఆయన ఇక్కడే సినిమా చూశారు. సినిమా చూసిన తర్వాత ఆయన ఎలా రెస్పాండ్ అవుతారో అనుకున్నాం. సినిమా బాగుంది, డబ్బింగ్, సాంగ్స్ ఎవరితో చేయిద్దాం అంటూ మాట్లాడారు. ఆయన మా మూవీ చూసిన వెంటనే అలా పాజిటివ్‌గా మాట్లాడటం మాకు ఎంతో నమ్మకాన్ని ఇచ్చింది. మా మూవీపై కాన్ఫిడెన్స్ కలిగేలా చేసిన సురేష్ కొండేటి గారికి థ్యాంక్స్. తెలుగు ఆడియెన్స్ మా సినిమాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు కృతజ్ఞతలు చెబుతున్నా” అన్నారు.

నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ.. “‘ప్రేమనే ఊరిలో’ సినిమాకు మంచి విజయాన్ని అందించిన తెలుగు ఆడియెన్స్‌కు థ్యాంక్స్. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి థియేటర్స్, స్క్రీన్స్ పెంచాం. ఈ క్రమంలో నాకు మా టీమ్ అంతా సపోర్ట్‌గా నిలిచారు. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని ముందునుంచీ నమ్మకంతో ఉన్నాం. ఆ నమ్మకాన్ని తెలుగు ఆడియెన్స్ నిజం చేశారు. కరోనా తర్వాత సినిమా డైనమిక్స్ మారిపోయాయి. ఒకప్పుడు శాటిలైట్, ఆ తర్వాత ఓటీటీలు సినిమాలను డిసైడ్ చేస్తూ వచ్చాయి. బిజినెస్ పరంగా చూస్తే ఒకప్పుడు ఉన్నంత కంఫర్ట్‌గా ఇప్పుడు నిర్మాతలు లేరు అని చెప్పుకోవచ్చు” అన్నారు.

నిర్మాత చందు శ్రీనివాస్ మాట్లాడుతూ.. “ఈ రోజు మా సినిమా సక్సెస్ మీట్‌కు అతిథిగా వచ్చిన సాయికుమార్ గారికి థ్యాంక్స్. ఆయన మాకు అందించిన ఈ సపోర్ట్‌ను మర్చిపోలేము. ‘ప్రేమనే ఊరిలో’ సినిమాను తెలుగు ఆడియెన్స్ బాగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా చూశాక మాపై ఎక్కువ గౌరవం కనబరుస్తున్నారు. మాకు గౌరవాన్ని తీసుకొచ్చిన చిత్రమిది. సినిమా చూస్తూ ఆడియెన్స్ ఎమోషనల్ అవుతున్నారు. నేనూ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నా. మంచి సినిమా చేశామనే అప్రిషియేషన్స్ మాకు అందిస్తున్న చిత్రమిది. తెలుగులో మా సినిమా రిలీజ్‌కు ఎంతో సపోర్ట్‌గా నిలిచిన సురేష్ కొండేటి గారికి థ్యాంక్స్” అన్నారు.

నటీనటులు: రంగాయణ రఘు, శ్రీరామ్, తపస్విని పూనాచా, రామికా శివు తదితరులు.

టెక్నీషియన్స్: డీవోపీ – రాజ్‌కాంత్ ఎస్.కె, ఎడిటర్ – హర్షిత్ ప్రభు, క్రియేటివ్ ప్రొడ్యూసర్ – దేవేంద్ర ఎం, అసోసియేట్ డైరెక్టర్ – శృతి మైదల, క్రియేటివ్ సపోర్ట్ – హేమ మనోజ్ మైదల, నిర్మాతలు – చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం – మనోజ్ కుమార్.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.