భారతీయ సినీ రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖ నటుడు నానా పటేకర్, ప్రముఖ దర్శకుడు సింగీతం…
‘ఇట్లు అర్జున’ సినిమా చాలా కొత్త లవ్ స్టోరీ. ఈ సినిమా, మ్యూజిక్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. – మ్యూజిక్ డైరెక్టర్ తమన్
అనీష్, అనస్వర రాజన్, ఎస్. తమన్ ‘ఇట్లు అర్జున’ నుంచి ‘యెల్లో చున్ని’ సాంగ్ లాంచ్.. ఫీల్‌గుడ్ వైబ్స్‌తో అదరగొడుతున్న సాంగ్
స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. ఈ సినిమాతో అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, డెబ్యూ దర్శకుడు మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. తమన్ ఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్, ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, ఇతర ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమా అక్టోబర్ 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు మేకర్స్ వైజాగ్ గీతం యూనివర్సిటీలో యెల్లో చున్ని సాంగ్ లాంచ్ చేశారు.
తమన్ ఎస్ బ్యూటిఫుల్ మెలోడీని కంపోజ్ చేశారు. ఈ పాటను తమన్, విశాల్ మిశ్రా కలిసి ఆలపించగా, శ్రీజో లిరిక్స్ ఆకట్టుకున్నాయి. అనీష్, అనస్వర రాజన్ తమ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. అనీష్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రత్యేకంగా అలరించాయి. బ్యూటిఫుల్ మెలోడీ, హీరోహీరోయిన్ల కెమిస్ట్రీతో పాట అదిరిపోయింది. ఇప్పటికే ఈ సాంగ్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటూ ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేస్తోంది.
సాంగ్ లోంచి ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. ‘ఇట్లు అర్జున’ లవ్లీ జర్నీ. లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం. సాధారణంగా ‘ థియేటర్లు, పగిలిపోవాలి, స్పీకర్లు కాలిపోవాలి’ అని నాకు మెసేజ్‌లు పెడుతుంటారు. కానీ మహేష్ వచ్చి ‘గుండె పగిలిపోవాలి’ అని చెప్పాడు. అలాంటి కథలు వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. మహేష్‌కి థాంక్యూ. చాలా కొత్త కంటెంట్. ఇందులో అనిరుధ్ పాడిన ‘హాయ్ రే’ పాటకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే ‘చిన్ని చిన్ని’ పాటని మోహిత్ పాడారు. ఇది కాకుండా ఇంకో పాట ఉంది. అది ఒక బిగ్ స్టార్ పాడుతున్నారు. అనీష్ అనస్వర అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. అక్టోబర్ 30న ‘ఇట్లు అర్జున’ సినిమా థియేటర్‌లోకి వస్తుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.
హీరో అనీష్ మాట్లాడుతూ… మీ అందరి ఎనర్జీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ ఎల్లో చున్ని పాట నచ్చడం ఇంకా ఆనందంగా ఉంది. మూవీలో నాకు ఫేవరెట్ సాంగ్ ఇది. ఒక అమ్మాయి నవ్వితే ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో చెప్పే సాంగ్ ఇది. మా కొరియోగ్రాఫర్స్ చాలా బ్యూటిఫుల్‌గా చేశారు. ప్రతి మూమెంట్‌ని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. తమన్ గారికి థాంక్ యూ. పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. అక్టోబర్ 30న అర్జున్ మాట మీకు వినపడకపోవచ్చు.. కానీ తన ప్రేమ మాత్రం మీ అందరికీ గట్టిగా కనిపిస్తుంది. అందరికీ థాంక్యూ.
హీరోయిన్ అనస్వర రాజన్ మాట్లాడుతూ.. అమ్మాయిలు, అబ్బాయిలు అందరికీ ఈ పాట డెడికేట్ చేస్తున్నాను. వెరీ బ్యూటిఫుల్ సాంగ్. అక్టోబర్ 30న మీరందరూ థియేటర్‌లోకి వెళ్లి సినిమా చూడండి. మీ అందరికీ చాలా నచ్చుతుంది. మీ అందరి ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు.
డైరెక్టర్ మహేష్ మాట్లాడుతూ..‘ఇట్లు అర్జున’కి ఆల్రెడీ సక్సెస్ వైబ్స్ వచ్చాయని అంటున్నారు. దానికి కారణం తమన్ గారే. ఆయన అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అనిష్ అనస్వర ప్రేమకథకి ప్రాణం పోశారు. అక్టోబర్ 30న ‘ఇట్లు అర్జున’ సినిమా చూడండి. మీరు థియేటర్‌కి వచ్చాక కచ్చితంగా సర్‌ప్రైజ్ అవుతారు. సినిమా చూసి ఒక మంచి స్మైల్‌తో బయటకు వస్తారు.
కొరియోగ్రాఫర్ ఫాల్గుణి మాట్లాడుతూ..‘చిన్ని చిన్ని’ సాంగ్‌లో అనీస్ అనస్వర అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. అనిష్ ఫస్ట్ సినిమా లాగా అనిపించలేదు. ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. తమన్ గారికి థాంక్యూ. ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే మా డైరెక్టర్ గారికి, నిర్మాతలకు థాంక్యూ సో మచ్. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది.

