భారతీయ సినీ రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖ నటుడు నానా పటేకర్, ప్రముఖ దర్శకుడు సింగీతం…
అక్టోబర్ 9 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ మలయాళ ఒరిజినల్ ‘EYES’
ప్రేమ.. నియంత్రణ.. వ్యామోహం.. పిచ్చి.. ఆమెను అతను గమనిస్తుంటే.. మరి అతడిని గమనిస్తున్నదెవరు?.. ప్రేమ ఎప్పుడు నియంత్రణగా మారుతుంది? అనురాగం ఎప్పుడు భయం, ప్రమాదానికి దారితీస్తుంది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన సోనీ లివ్ మలయాళ ఒరిజినల్ ‘ఐస్’(EYES) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలాంటి ప్రేమ, వ్యామోహం వెనుక దాగి ఉన్న చీకటి కోణాలను చూపించే ఈ బిహేవియరల్ క్రైమ్ డ్రామా ఆద్యంతం ఉత్కంఠను అందించనుంది. ఈ ఒరిజినల్ అక్టోబర్ 9 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
‘EYES’ కథలో కీలక పాత్రలో కని కుస్రుతిగా పోలీస్ ఆఫీసర్ టీనా సెబాస్టియన్ కనిపించనున్నారు. ప్రేమ, వ్యామోహం, నియంత్రణ హద్దులు దాటుతున్న కేసులకు సంబంధించిన దర్యాప్తులో టీనా చిక్కుకుంటుంది. ఈ కేసులను ఛేదించే క్రమంలో ప్రేమ, ప్రమాదం మధ్య ఉన్న సరిహద్దులు క్రమంగా చెదిరిపోతాయి. భయం, అభద్రత, అనిశ్చితి వంటి భావనలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తాయి. అయితే టీనా నిజం తెలుసుకునే కొద్దీ.. ఆమె వెలుగులోకి తీసుకొచ్చే విషయాలు ఊహించిన దానికంటే మరింత భయానకంగా ఉంటాయి.
దీని గురించి దర్శకుడు మనూ అశోకన్ మాట్లాడుతూ.. “నిజాయితీగా, సున్నితమైన భావోద్వేగాలతో చెప్పాలనుకున్న కథే ‘EYES’. స్టాకింగ్ అనేది కేవలం ఒక నేరం మాత్రమే కాదు.. అది ఒక వ్యక్తి భద్రతపై, మానసిక ప్రశాంతతపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే.. ఈ వాస్తవాన్ని కూడా సిరీస్‌లో చూపించే ప్రయత్నం చేశాం. ఈ కథకు ప్రాణం పోసిన నటీనటులు, సాంకేతిక బృందానికి నా కృతజ్ఞతలు. సోనీ లివ్ ద్వారా ఈ సిరీస్‌ను చూసే ప్రేక్షకులు కథతో కనెక్ట్ అవుతారని, ఈ అంశాన్ని మరో కోణంలో చూసేలా ‘ఐస్’ మూవీ ఆలోచన రేకెత్తిస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు.
మనూ అశోకన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు బాబీ-సంజయ్ రైటర్స్. అంజనా నాయర్ కథ ఆధారంగా ఐస్ చిత్రం తెరకెక్కింది. ‘ఉయరే’, ‘కానేక్కానె’ చిత్రాల తర్వాత మను అశోకన్, ప్రముఖ రచయితల ద్వయం బాబీ–సంజయ్ కాంబినేషన్‌లో వస్తున్న సిరీస్ కావడం విశేషం. డ్రీమ్ క్యాచర్ నిర్మిస్తోన్న ఈ సిరీస్‌లో కని కుస్రుతితో పాటు నిఖిలా విమల్, దేవ్ మోహన్, సానియా అయ్యప్పన్, శ్రుతి కీలక పాత్రల్లో నటించారు.
మలయాళ ఒరిజినల్ సిరీస్ ‘EYES’ సోనీ లివ్‌లో మాత్రమే అక్టోబర్ 9 స్ట్రీమింగ్
https://www.instagram.com/p/DeORxCFM4gX
https://www.instagram.com/p/DeHd8d2M6uy
https://www.instagram.com/p/DeEJlOmxN1N



