అక్టోబర్ 9 నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్ మలయాళ ఒరిజినల్ ‘EYES’
ప్రేమ.. నియంత్రణ.. వ్యామోహం.. పిచ్చి.. ఆమెను అతను గమనిస్తుంటే.. మరి అతడిని గమనిస్తున్నదెవరు?.. ప్రేమ ఎప్పుడు నియంత్రణగా మారుతుంది? అనురాగం ఎప్పుడు భయం, ప్రమాదానికి దారితీస్తుంది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన సోనీ లివ్ మలయాళ ఒరిజినల్ ‘ఐస్’(EYES) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలాంటి ప్రేమ, వ్యామోహం వెనుక దాగి ఉన్న చీకటి కోణాలను చూపించే ఈ బిహేవియరల్ క్రైమ్ డ్రామా ఆద్యంతం ఉత్కంఠను అందించనుంది. ఈ ఒరిజినల్ అక్టోబర్ 9 నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది. ‘EYES’ కథలో కీలక పాత్రలో కని కుస్రుతిగా పోలీస్ ఆఫీసర్ టీనా సెబాస్టియన్ కనిపించనున్నారు. ప్రేమ, వ్యామోహం, నియంత్రణ హద్దులు దాటుతున్న కేసులకు సంబంధించిన దర్యాప్తులో టీనా చిక్కుకుంటుంది. ఈ కేసులను…
