Skip to content

“రణబాలి” నా కెరీర్ లో గొప్ప సినిమా గా నిలిచిపోతుంది – హీరో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిపారు. ఈ కార్యక్రమంలో

ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని మాట్లాడుతూ – మా “రణబాలి” సినిమా ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాము. ఇలాంటి గొప్ప కథ మా దగ్గరకు వచ్చినందుకు సంతోషిస్తున్నాం. రాహుల్ ఈ కథ చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యాం. మాకు కథ చెప్పినదాని కంటే బాగా సినిమాను రూపొందించాడు. విజయ్ గారికి ఇది పర్పెక్ట్ మూవీ. ఇందులో విజయ్ నట విశ్వరూపం చూపించారు. విజయ్ రశ్మిక పెళ్లయ్యాక జంటగా మా సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ మూవీలో బాగా నటించారు. ప్రేక్షకులకు “రణబాలి” ఒక మంచి ఎక్సిపీరియన్స్ లా ఉంటుంది. అరుదైన కథ ఇది. ప్రతి ఒక్కరూ మా సినిమాను ఇష్టపడతారు. ఈ నెల 16న థియేటర్స్ కు వచ్చి మా సినిమా చూడాలని కోరుతున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ రవిశంకర్ మాట్లాడుతూ – మా డైరెక్టర్ రాహుల్ ఎంతో రీసెర్చ్ చేసి డీటెయిల్స్ సేకరించి ఈ సినిమాను రూపొందించాడు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. మీకు ఈ సినిమాలో కథా నేపథ్యానికి సంబంధించిన ప్రతి డీటెయిల్ ఆథెంటిక్ గా కనిపిస్తుంది. మీరు సినిమా చూస్తున్నంత సేపు “రణబాలి” ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ఈ కథను పర్పెక్ట్ గా చేసుకునేందుకు రాహుల్ ఎంతో శ్రమించారు. రెండేళ్ల పాటు కంటిన్యూగా ఆఫీస్ లోనే కూర్చుని వర్క్ చేసుకున్నారు. మూవీ కాపీ చూసుకున్న తర్వాత మేమంతా సంతృప్తిగా, సంతోషంగా ఉన్నాం. మూవీ చాలా బాగా వచ్చింది. ఈ మూవీ కోసం విజయ్ గారు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. రణాబాలిగా ట్రాన్స్ ఫర్మ్ అయ్యారు. గుర్రం స్వారీ నేర్చుకున్నారు. ఆయన ఈ సినిమాతో చాలా చాలా పెద్ద స్థాయికి వెళ్తారు. రాయలసీమ స్లాంగ్ లో విజయ్ గారు నటించిన విధానం, ఆ క్యారెక్టర్ బిహేవియర్ లో ప్రతి డీటెయిలింగ్ చూపించిన విధానం ఎక్స్ట్రార్డినరీగా ఉంది. మా జయమ్మగా రశ్మిక అద్భుతంగా నటించింది. ఆమె మా సంస్థలో డియర్ కామ్రేడ్, పుష్ప..ఇలా అసోసియేట్ అవుతూ వస్తోంది. టెక్నీషియన్స్ అంతా మంచి క్వాలిటీ ఔట్ పుట్ ఇచ్చారు. అక్టోబర్ 16న మీరు సినిమా చూస్తూ ఎక్ట్రార్డినరీగా ఫీల్
అవుతారు. విజయ్ తో దాదాపు 8 ఏళ్ల జర్నీ మాది. ఆయన అద్భుతమైన పర్సన్. చాలా సాఫ్ట్ గా ఉంటాడు. చాలా మంచి వ్యక్తి. ఆయన మీద ఇంటెన్షల్ గా సోషల్ మీడియాలో నెగిటివిటీ చేస్తున్నారు కొందరు. ఈ అబ్బాయి చాలా మంచోడు, మీకు ఎందుకు పిచ్చి పిచ్చి పనులు. ఆయన సినిమాకు పెట్టే ఎఫర్ట్స్ ను అప్రిషియేట్ చేయండి. విజయ్ సినిమా ఏదైనా నచ్చకుంటే అది మీ ఇష్టం. మేము ట్రైలర్ కూడా రిలీజ్ చేయకముందే బ్రిటీష్ కాలం కథంటా, ఇవి ఆడతాయా అని నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారు. మీరు విజయ్ ను దూరం నుంచి చూస్తున్నారు. మేము దగ్గరగా కొన్నేళ్లుగా చూస్తున్నాం. ఆయన సినిమా, ఆయన క్యారెక్టర్ వరకే మాట్లాడుతాడు గానీ ఎవరి గురించి మాట్లాడడు, ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోడు. విజయ్ కు ఆయన సినిమా తప్ప మరో లోకం లేదు. అలాంటి హీరో పట్ల నెగిటివ్ ప్రచారం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. విజయ్ గురించి పాజిటివ్ గా ఆలోచించండి ప్రతీది మంచిగానే కనిపిస్తుంది. ట్రైలర్ ఎంత క్వాలిటీగా, గ్రాండ్ గా ఉందో సినిమా కూడా అందుకు ఏమాత్రం తగ్గదు. రణబాలి అనే ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాను మీరు ఈ నెల 16న థియేటర్స్ లో చూడబోతున్నారు. అన్నారు.

డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ మాట్లాడుతూ – నేను సినిమా చేసి చాలా ఏళ్లవుతోంది. ఒక గొప్ప సినిమా మీ ముందుకు తీసుకురావడానికి ఇంత టైమ్ తీసుకున్నాను. రణబాలి అనే సినిమాను నేను గర్వంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. శ్యామ్ సింగరాయ్ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేయాలని ఆలోచిస్తున్న టైమ్ లో నా దగ్గరకు ఒక బుర్రకథ వచ్చింది. అప్పట్లో సినిమాలు కూడా లేని టైమ్ లో బుర్రకథల ద్వారానే వీరుల గాథలు ప్రజలకు తెలిసేవి. అవి ఒక తరం నుంచి మరో తరానికి తెలిసేవి. అలాంటి ఒక వీరుడి కథ బుర్రకథ రూపంలో నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ వీరుడి కథ విని నేను షాక్ అయ్యాను. నేను విన్న వీరుడి కథలో అతను దేవుళ్లతో మాట్లాడుతాడు, రాక్షసులను ఎదుర్కొంటాడు, గుర్రపు స్వారీ చేస్తాడు, పెద్ద పెద్ద యుద్ధాలు చేస్తాడు. రాయలసీమ నుంచి వచ్చిన వీరుడు అతను. ఇలాంటి సినిమాను నేను చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. మన తెలుగు ఆడియెన్స్ కు ఇలాంటి గొప్ప ఎమోషన్స్ ఉన్న కథను చెప్పాలని రణబాలి సినిమాను మొదలుపెట్టాను. ఈ కథలో ఏ కంటెంట్ చెప్పాలని ఆలోచించి, ఆ క్రమంలో రాయలసీమ చరిత్ర చదవడం ప్రారంభించాను. అందులో కరువు గురించి తెలుసుకున్నాను. ఆ కరువు రాయలసీమకు, కోస్తాంధ్రకు, కొంతభాగం తెలంగాణకు, కర్ణాటక, తమిళనాడుకు మైసూర్ కు అందరికీ సంబంధించిన ఒకటే కరువు గురించి తెలిసింది. రెండేళ్లు సాగిన ఆ కరువు పేరు ది గ్రేట్ సౌత్ ఇండియన్ మద్రాస్ ఫామైన్. కేవలం రెండేళ్లలో కోటి మంది ఆకలితో చనిపోయారని తెలుసుకుని షాక్ కు గురయ్యా. ఇది నిజమా, సాధ్యమా అనిపించింది. ఇది నిజమైతే మన పాఠ్య పుస్తకాల్లో ఈ కరువు గురించి ఎందుకు చెప్పలేదు అని పరిశోధన మొదలుపెట్టాను. ఎన్నో పుస్తకాలు చదివాను. ఎన్నో ప్రాంతాలకు వెళ్లి, ఎంతోమంది చరిత్రకారులను కలిసి ఈ కరువు ఘటన నిజమేనని తెలుసుకున్నాను. అప్పుడే నేను నెక్ట్స్ చెప్పబోయే సినిమా కంటెంట్ ఇదేనని నిర్ణయించుకున్నాను. ఇది ప్రపంచానికి చెప్పాల్సిన కథ అనిపించింది. మైత్రీ సంస్థలో నేనొక మూవీ చేయాలి. ప్రొడ్యూసర్ రవి గారికి ఈ కథా నేపథ్యం, క్యారెక్టర్, బ్యాక్ డ్రాప్ గురించి స్ట్రక్చర్ వేసి చెప్పాను. ఆయనకు నచ్చి చాలా సపోర్ట్ అందించారు. ఈ కథకు ఒక పవర్ ప్యాక్డ్ యాక్టర్ కావాలి. చందమామ కథల్లోని వీరుడిలా కత్తి పట్టుకుని గుర్రం మీద ఉన్న రూపం గుర్తుకురావాలి. ఇంత టైమ్, హార్డ్ వర్క్, ఎఫర్ట్ ఎవరు పెట్టగలరు అని ఆలోచించినప్పుడు విజయ్ దేవరకొండ తప్ప మరో ఆప్షన్ నాకు కనిపించలేదు. విజయ్ కు నా ఐడియా నచ్చింది. ఆయనకు కూడా హిస్టరీ అంటే ఇష్టం. నాతో పాటు ఆయన కూడా ప్రపంచానికి చెప్పాల్సిన కథ ఇది అని నమ్మారు. అప్పటి నుంచి రణబాలి కోసం మా జర్నీ మొదలైంది. ఈ సినిమా కోసం నాలుగేళ్లు శ్రమించాం. ఈ నెల 16న మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఆన్ లైన్ లో ఆర్డర్ పెడితే ఐదు నిమిషాల్లో మనకు ఫుడ్ వస్తుంది. కానీ కేవలం ఆహారం దొరక్క కోటి మంది మన పూర్వీకులు చనిపోయారంటే ఎంత దారుణం. ఈ కోపం నుంచి ఆక్రోశం నుంచి పుట్టిందే ఈ సినిమా. రణబాలి సినిమా ఒక యుద్ధంలా ఉంటుంది. ఒక గొప్ప సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ అందించే సినిమా మీకు ఇవ్వబోతున్నామని గర్వంగా చెబుతున్నా. అన్నారు.

హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – మరో 8 రోజుల్లో దసరా పండక్కి రణబాలి సినిమా మీ ముందుకు వస్తోంది. మనకు ఏ చరిత్ర తెలియకుండా దాచారో, ఏ వీరుల చరిత్ర తెలియకూడదు అనుకున్నారో, ఏ కథలు జానపథాల్లో, బుర్రకథల్లో చెబుతూ మనం మర్చిపోకుండా చేశారో, ఆ చరిత్రను సరిదిద్దే ప్రయత్నం అక్టోబర్ 16న రణబాలి చేయబోతున్నాడు. ఆ వీరులను సెలబ్రేట్ చేసే ప్రయత్నమే మా సినిమా. ఆ బుర్రకథల్ని, చరిత్రను ప్రపంచమంతా చూసేలా బిగ్ స్క్రీన్ మీద ఎక్సిపీరియన్స్ చేసేలా ఆ ప్రపంచంలోకి మీ అందరినీ తీసుకెళ్లేలా రణబాలి ఉంటుందని గట్టిగా నమ్ముతున్నాను. టాక్సీవాలా కథ విన్నప్పుడే రాహుల్ ఎంత సూపర్బ్ రైటర్ అనేది అర్థమైంది. రణబాలి కథ నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఈ ఏడాది తెలుగు సినిమా నుంచి వస్తున్న గొప్ప స్క్రిప్ట్ ఇదేనని అనిపించింది. కథే కాదు రణబాలి, జయమ్మ, హెక్టార్..ఇలా ప్రతి క్యారెక్టర్, ఆ ఊరు, మా అమ్మ ఊరైన శింగనమల…ఈ వరల్డ్ అంతా ఎంతో గొప్పగా రాశాడు రాహుల్. ఆ కరువు అనే పాయింట్ ను మన కల్చర్ నుంచి, మాసీ హీరోయిక్ గా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇంత పెద్ద కథ చెబుతూ ఎన్నో లేయర్స్ ను ఒక పర్పస్ కు ముడిపెడుతూ బ్యూటిఫుల్ గా కథ రాశాడు రాహుల్. ఇలాంటి గొప్ప కథ మళ్లీ రాహుల్ రాస్తాడో లేదో తెలియదు. ఈ సినిమా కోసం ఫస్ట్ ప్రొడ్యూసర్ రవి గారు నా దగ్గరకు వచ్చారు. మాస్ ఎలిమెంట్స్ కు ఆయన బాగా ఎగ్జైట్ అవుతారు. ఆ తర్వాత కథ విన్నాను. మనకు రాసిపెట్టి ఉన్న స్క్రిప్ట్స్ మన దగ్గరకు వస్తాయని అంటారు. నేను ఈ సినిమా వరకు రవి గారికి థ్యాంక్స్ చెప్పాలా, రాహుల్ కు థ్యాంక్స్ చెప్పాలా, ఆ విధికి థ్యాంక్స్ చెప్పాలా తెలియడం లేదు. నా కెరీర్ లో రణబాలి ఒక పెద్ద హైలైట్ గా నిలిచిపోతుందని నమ్ముతున్నా. మూవీ రిలీజ్ కోసం ఎగ్జైటింగ్ గా వేచి చూస్తున్నా. మీరంతా ఈ నెల 16న ఈ సినిమా తప్పకుండా చూడాలి. మీ ఫ్యామిలీకి చూపించాలి. మనం ఎలాంటివి దాటుకుని ఇక్కడి దాకా వచ్చాం. మనలో ఎలాంటి డీఎన్ఏ ఉంది అని తెలుసుకునేందుకు మీరు సినిమా చూడాలి. ఈ చిత్రంలో భాగమవడం గర్వంగా ఉంది. రశ్మిక ఈ ఈవెంట్ కు రానందుకు నా తరుపున సారీ చెబుతున్నా. నెగిటివ్ స్ప్రెడ్ చేసేవాళ్లు తమ జీవితాలు గొప్పగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయండి. నా కలలు, నా శ్రమ వాళ్లకు అనవసరం అనిపిస్తే నేనాగాలా? నా హానెస్టీ వాళ్లకు అహంకారం అనిపిస్తే, నా ఆత్మవిశ్వాసం వాళ్లకు బలుపు అనిపిస్తే నేను తగ్గాలా, నా జర్నీ వాళ్లకు అర్థం కాకపోతే నేను ఇంట్లో కూర్చోవాలా, నేను మారను. వాళ్లు మారాలి. మీరు కూడా బాగుపడితే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా బాగుంటారు. ఇలా వెనక్కి లాగే పనులు చేస్తే ఉపయోగం ఉండదు. కొందరు గ్రూప్ గా మారి ఇలాంటి నెగిటివిటీ తయారుచేస్తుంటారు. అన్నారు.

నటీనటులు – విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ, తదితరులు

టెక్నికల్ టీమ్
—————–
బ్యానర్ – మైత్రీ మూవీ మేకర్స్
సమర్పణ – గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్
ప్రొడ్యూసర్స్ – నవీన్ యెర్నేని, రవిశంకర్
స్టోరీ, డైరెక్షన్ – రాహుల్ సంకృత్యన్
కో ప్రొడ్యూసర్స్- అనురాగ్ పర్వతనేని, శివ్ చనన
సీఈవో – చెర్రి
మ్యూజిక్ – అజయ్ – అతుల్
డీవోపీ – నీరవ్ షా, జిష్ణు భట్టాజిష్ణు భట్టాచర్జీ
రైటర్ – ప్రమోద్ తమ్మినేని
ప్రొడక్షన్ డిజైనర్ – శివం రావు నాగసాని
ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్ ఆర్
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఆర్ చంద్రశేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – చెంబోలు సాయి ఆదిత్య
కొరియోగ్రఫీ – కృతి మహేశ్
కాస్ట్యూమ్ డిజైనర్ – అర్చన రావు
ఆర్ట్ డైరెక్టర్ – విఠల్ కోసనం
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – సునీల్ రాజు చింత
యాక్షన్ కొరియోగ్రాఫర్స్ – యెన్నిక్ బెన్, ఆండీ లాంగ్ గ్యుయెన్, రాబిన్ సుబ్బు
సౌండ్ డిజైనర్ – రఘునాథ్ కెమిశెట్టి
పబ్లిసిటీ డిజైనర్ – కబిలన్ చెల్లయ్య
పీఆర్ఓ – సురేష్ ( ఎస్ కె మీడియా )
మార్కెటింగ్ – ఫస్ట్ షో

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.